Pesara Pappu For Weight Loss: పెసర పప్పు తింటే బరువు తగ్గుతారా.. ఇది నిజమేనా?
Pesara Pappu For Weight Loss: క్రమం తప్పకుండా పెసర పప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది.
Pesara Pappu For Weight Loss: భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పప్పుధాన్యాల్లో పెసర పప్పు ఒకటి.. ఇందులో శరీరానికి కావాల్సిన అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు ఈ పెసర పప్పులో ఫైబర్, ఖనిజాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇవే కాకుండా శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
పెసర పప్పులో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి రెండూ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పెసర పప్పులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. దీని కారణంగా అన్ని రకాల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
పెసర పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
4. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పెసర పప్పులో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆకలి కూగా నియంత్రణలో ఉంటుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో లభించే ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
5. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
పెసర పప్పులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి ఎంతో సులభంగా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ముడతలతో పాటు నూనె చర్మం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఇందులో లభించే విటమిన్ B చర్మాన్ని ఆరోగ్యంగా చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి