COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Piles Treatment Without Surgery In Telugu: పైల్స్ సమస్య అనేది అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య. ప్రస్తుతం ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది. అయితే ఈ సమస్య కొంతమందిలో మలబద్ధకం కారణంగా కూడా వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఇంటి నివారణలు కూడా పాటించడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పైల్స్‌ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ధూమపానానికి దూరంగా ఉండాలి:
పైల్స్‌ సమస్యలతో బాధపడేవారు ధూమపానానికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ధూమపానం చేయడం వల్ల జీర్ణకోశ గోడపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. కాబట్టి పైల్స్ సమస్యతో బాధపడేవారిలో ఇలాంటి అలవాట్లు ఉంటే తప్పకుండా మానుకోవాల్సి ఉంటుంది.  


ప్రోటీన్ ఫుడ్‌ తినకూడదు:
పైల్స్‌ ఉన్నవారు ప్రోటీన్ ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసహారాల్లో ప్రోటీన్‌ కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యల తీవ్ర తరమయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు జీర్ణక్రియ దెబ్బ తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. పైల్స్‌ ఉన్న కొంతమందిలో పురీషనాళంలో మంటలు కూడా రావచ్చు.


కాఫీ, టీలరకు దూరంగా ఉండాలి:
పైల్స్‌ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది. దీంతో పాటు కాఫీ, టీలకు దూరంగా ఉండడం మరి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కెఫిన్ అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.


స్పైసీ ఫుడ్స్‌ తినొద్దు:
పైల్స్ వ్యాధిగ్రస్తులు ఎర్ర మిరపకాయ లేదా స్పైసీ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కూడా సమస్య పెరిగే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు కలిగిన ఆహారాలు తీసుకోడం వల్ల ప్రేగు కదలికల్లో అనేక సమస్యలు వచ్చి నొప్పులకు దారి తీసే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


బేకరీ ఫుడ్స్‌:
పైల్స్ సమస్యతో  ఇబ్బంది పడేవారు  బేకరీ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల సమస్య తీవ్రతరమయ్యే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే బేకరీ ఆహార పదార్థాల్లో అధిక పరిమాణంలో గుడ్డు సొన ఉంటుంది. కాబట్టి ఇది మలబద్దకానికి దారి తీసే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు తెలుతుపుతున్నారు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter