Pink Guava Benefits: పింక్ జామతో బరువు తగ్గడమే కాదు బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్..
Pink Guava Benefits For Winter Season: వైట్ కలర్లో ఉండే జామ పండుకు బదులుగా పింక్ జామను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీర బరువును నియంత్రించే గుణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి.
Pink Guava Benefits For Winter Season: శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్‌లో లభించే పండ్లలో జామ పండ్లు ఒకటి. ఇవి మధురమైన సువాసనతో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే మనం ఎక్కువ లోపల తెల్లని గుజ్జు కలిగిన జామ పండ్లను తింటూ ఉంటాము. కానీ మార్కెట్‌లో అప్పుడప్పుడు గులాబీ రంగు గువ్వం కలిగిన జామ పండ్లు కూడా లభిస్తాయి. అయితే వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, విటమిన్ సి, ఫైబర్, పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. పింక్ జామ పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పింక్ జామ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:
పింక్ కలర్ గువ్వం కలిగిన జామను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మంచి కొవ్వులా మారుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా బాడీని కూడా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోగనిరోధక శక్తి కోసం:
గులాబీ రంగు జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 100 గ్రాముల జామపండులో శరీరానికి 228 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
శరీర బరువును తగ్గిస్తుంది:
పింక్ జామను క్రమం తప్పకుండా తీసుకోవడం శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో పింక్ సాల్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహం నియంత్రణ కోసం:
ఈ పింక్ జామలో ఉండే గుణాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదులో లభిస్తాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter