Pistachio Magic: రోజు గుప్పెడన్ని పిస్తా పలుకులు తింటే ఏమవుతుందో తెలుసా?
Pistachio Magic: ప్రతిరోజు పిస్తా పలుకులు తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే అద్భుతమైన గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే శరీర బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పిస్తా పలుకులు ఔషధం కంటే ఎక్కువ పని చేస్తాయి.
Pistachio Magic: పిస్తా పలుకులు ఎక్కువగా స్వీట్ల తయారీలో వినియోగిస్తూ ఉంటారు ఇవి నోటికి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా కరకరలాడుతూ ఉంటాయి. అలాగే చాలామంది బయట లభించే సాల్టెడ్ పిస్తాను కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రోటీన్ ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల శరీర కండరాల నిర్మాణంలో మార్పులు రావడమే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అలాగే ఈ పిస్తాలో విటమిన్ E, విటమిన్ B6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పిస్తా పలుకుల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గుండెను శక్తివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయి. ఇవే కాకుండా పిస్తా పలుకులు తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.
పిస్తా పలుకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
దీర్ఘకాలిక గుండె సమస్యలకు చెక్:
పిస్తా పలుకుల్లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించేందుకు ఎంతగానో ప్రభావం చూపుతాయి. దీని కారణంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తగ్గిపోయి మంచి కొవ్వు పెరుగుతుంది. దీంతో ఎలాంటి గుండె సమస్యలు అయినా తొలగిపోయి.. గుండె ఆరోగ్యంగా తయారవుతుంది.
శరీర బరువు నియంత్రణ:
పిస్తా పలుకుల్లో ఎంతో శక్తివంతమైన ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపి శరీర బరువు నియంత్రణకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. అలాగే ఎంతో సులభంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా డైట్ లో భాగంగా పిస్తా పలుకులను చేర్చుకోవడం మేలని డైటీషియన్లు చెబుతున్నారు.
ఉక్కు లాంటి ఎముకల కోసం:
పిస్తా పలుకుల్లో క్యాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు వీటితో తయారుచేసిన పౌడర్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల ఎముకలు ఉక్కులా తయారవుతాయి. దీని కారణంగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధిలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మ సమస్యలు:
పిస్తా పలుకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మెరిసేలా అందంగా ముస్తాబవుతుంది. తరచుగా మచ్చలు ఇతర సమస్యలతో బాధపడే ఎవరైనా ఈ పిస్తా పలుకులను రోజు తినవచ్చు.
మెదడు సమస్యలకు:
పిస్తా పలుకుల్లో ఉండే కొన్ని మూలకాలు, అలాగే విటమిన్ ఈ మెదడు కణాలను మెరుగుపరిచేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇది మెదడును రక్షించడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచేందుకు:
రోజు పిస్తా పలుకులు తింటే శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ శరీరానికి లభించి శరీరం దృఢంగా ఉక్కులా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపులు మెరుగుపరిచేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుందట.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.