Pomegranate Diabetes: ఈరోజుల్లో చాలా మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే చాలామంది షుగర్ వ్యాధి బారినపడుతుండడం గమనార్హం. మధుమేహంతో బాధపడే వారికి అథెరోస్క్లెరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్స్, రక్త ప్రసరణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షుగర్ వ్యాధిగ్రస్తులు మూడు నెలల పాటు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా.. అనారోగ్యకరమైన LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు. దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ డయాబెటిస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుందని తెలియజేస్తున్నారు. 


అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్ల రసాలను తీసుకోకపోవడమే మంచిది. వాటిలో చక్కెర స్థాయి అధిక మోతాదులో ఉండడం వల్ల.. వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. దానిమ్మ విత్తనాల రసంలోని చక్కెర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అథెరోస్క్లెరోసిస్ నుంచి గుండెకు రక్షణని ఇస్తుంది.


డయాబెటిక్ ముప్పు తగ్గుతుంది!


దానిమ్మ రసం తాగడం వల్ల డయాబెటిస్ ద్వారా పొంచి ఉండే ముప్పును తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. కానీ ఇది రోగ నిరోధక కణాల ద్వారా ఆక్సీకరణం చెందే చెడు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలోనూ తోడ్పడుతుంది. అయితే పండ్ల రసాలను తీసుకునే విషయంలో వైద్యుని సలహా తీసుకుంటే మంచిది. 


(నోట్: ఈ సమాచారమంతా కొంతమంది ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సమాచారం నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)        


Also Read: Henna for Hair: జుట్టుకు హెన్నా రాసుకునే వాళ్లు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి!


Also Read: Sugarcane Juice Benefits: వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook