Potato Side Effects: బంగాళదుంపను కూరగాయలలో రారాజుగా పరిగణిస్తారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? వారంలో ఎక్కువ రోజులు బంగాళదుంపలను తినడం వల్ల అనేక దుష్ర్పభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీని వల్ల బరువు పెరగడం సహా మధుమేహం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలెర్జీ బారిన పడే అవకాశం..


మీరు బంగాళదుంపలను అధికంగా తింటుంటే.. దాని వల్ల మీరు అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంది. 


అర్థరైటిస్ రోగులకు ప్రమాదకరం..


బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు ఎక్కువగా బంగాళదుంపలను తినకూడదు.


షుగర్ పేషెంట్లు జాగ్రత్త..


బంగాళదుంపల అధిక వినియోగం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం మరింత పెరుగుతుంది. కాబట్టి, బ్లడ్ లోని షుగర్ ను నియంత్రించేందుకు బంగాళదుంపలు ఏమాత్రం సహకరించదు. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినకపోవడమే మంచిది. 


రక్తపోటు పెంచుతుంది..


బంగాళదుంపల అధిక వినియోగం రక్తపోటును కూడా పెంచుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. 


బరువు పెరుగుతారు!


బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధిక మొత్తంలో కేలరీలు పెరుగుతాయి. ఇది ఊబకాయానికి కారణమవుతుంది. 


Also Read: Skin Glow With Egg: గుడ్డుతో ముఖం మెరిసిపోతుందా? ఉపయోగించడానికి సరైన పద్ధతులను తెలుసుకోండి


Also Read: Buttermilk Side Effects: ఈ సమస్యలుంటే మజ్డిగను దూరం పెట్టేయాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook