White Hair Problem: కేశాలు అందంలో ఓ భాగం. అందుకే కేశాలు ధృఢంగా ఉండాలని, నల్లగా నిగనిగలాడుతుండాలని కోరుకుంటారు. కానీ కొన్ని కారణాలతో యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. వృద్ధాప్యంలో కన్పించే ఈ లక్షణం యుక్త వయస్సులోనే ఎదురౌతోంది. మరి ఈ సమస్యకు కారణమేంటి, పరిష్కారం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యుక్త వయస్సుకే జుట్టు తెల్లబడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు కారణం. దీనికోసం కెమికల్ ఆధారిత హెయర్ కలర్స్ వాడుుతంటారు. దాంతో జుట్టు తాత్కాలికంగా నల్లబడినా డ్యామేజ్ అయిపోతుంటుంది. దీనినే ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్ అంటారు. నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు తెల్లబడుతుందంటే థైరాయిడ్ వ్యాధి, విటమిన్ బి 12 లోపం కావచ్చు. మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం మొబైల్ ఫోన్ రేడియేషన్ కూడా జుట్టు త్వరగా తెల్లబడటానికి కారణం. 


ఈ సమస్య నుంచి విముక్తి ఎలా


జుట్టు తెల్లబడకుండా నియంత్రించేందుకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రధానంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. రోజూ 7-8 గంటలు మంచి నిద్ర ఉండాలి. రోజూ తీసుకునే డైట్‌లో ఆకు కూరలు, పండ్లు ఉండేట్టు చూసుకోవాలి. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలి. ధైరాయిడ్ లేదా ఇతర వ్యాధి ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలి. వాస్తవానికి తెల్ల వెంట్రుకలు నల్లబడేందుకు ఎఫెక్టివ్ రెమిడీ ఏదీ లేదు.


Also read: Fatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook