Prolonged sitting increases Blood Clot Risk: మీకు టీవీ ముందు గంటలకొద్ది కదలకుండా కూర్చొనే అలవాటు ఉందా.. చేతిలో రిమోట్ పట్టుకున్నారంటే నాన్ స్టాప్ నాలుగైదు గంటలు టీవీకి అతుక్కుపోతారా... అయితే మీ హెల్త్‌ రిస్క్‌‌లో పడినట్లే.. కదలకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారి హెల్త్ కూడా రిస్క్‌లో పడినట్లే.. ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 20న యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఈ అధ్యయనం జర్నల్‌గా ప్రచురితమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ అధ్యయనం ప్రకారం... ఎక్కువ సేపు కదలకుండా కూర్చొనేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది కాళ్లలో బ్లడ్ క్లాట్స్ (రక్తం గడ్డ కట్టడం)కి దారితీయవచ్చు. 'ఎక్కువసేపు టీవీ ముందు కూర్చొనేవారిలో వీటీఈ (సిరల వాపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సుదీర్ఘ ప్రయాణం తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిరగమని చెబుతుంటాం. ఎక్కువసేపు కాళ్లు మడిచి కూర్చోవడం ద్వారా రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా అది రక్తం గడ్డ కట్టడానికి దారితీయవచ్చు. పైగా, ఇలా ఎక్కువసేపు కూర్చొండిపోయేవారు అన్‌హెల్తీ స్నాక్స్ తీసుకుంటుంటారు. అది ఒబెసిటీ, అధిక రక్తపోటుకు కూడా దారితీయవచ్చు.' అని ఆ పరిశోధకుల్లో ఒకరైన డా.కునుత్సోర్ వెల్లడించారు.


తాజా అధ్యయనం ప్రకారం నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ ముందు కూర్చొనేవారు లేదా కూర్చొని పనిచేసేవారిలో బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలా నాన్‌స్టాప్ నాలుగు గంటల పాటు కూర్చొనేవారిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీటీఈ (సిరల వాపు) బారినపడే ప్రమాదం 1.35 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం ప్రతీ 30 నిమిషాలకు ఒకసారైనా లేచి కాసేపు అటు, ఇటు నడవాలి. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నరాల్లో రక్తం గడ్డ కట్టే రిస్క్ ఉండదు. ఈ అధ్యయనం కోసం 40 ఏళ్లు, అంతకన్నా పైబడిన 1,31,000 మందిపై పరిశోధన జరిపినట్లు పరిశోధకులు వెల్లడించారు. 


Also Read: CM KCR on Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్‌'పై సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ..


Also Read: Complaint for Mutton Curry: మటన్ కర్రీ వండలేదని భార్యపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook