లండన్: గంటల తరబడి అలాగే కూర్చుండిపోతున్నారా. అయితే మీరు ఓ కచ్చితంగా గుర్తుంచుకోవాలి. గంటల తరబడి అలాగే కూర్చునేవారు డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉండేవారు డిప్రెషన్ బారినపడే అవకాశాలు ఎక్కువ. వీరు ప్రతిరోజూ ఓ గంటపాటు రన్నింగ్, వాకింగ్, జిమ్, యోగా లాంటి శారీరక శ్రమ చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చునని లాన్సెట్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించారు.  కరోనాపై గర్భవతులకు శుభవార్త.. ఆ ఆందోళన అక్కర్లేదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూకేలోని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రముఖ రచయిత ఆరోన్ కండోలా మాట్లాడుతూ ‘కౌమారదశలో రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉంటే.. 18 ఏళ్లు వచ్చేసరికి వారిలో నిరాశ, నిస్పృహలకులోనయ్యే ప్రమాదం ఉందది. మొత్తం  4,257 కౌమారదశల (12, 14, 16, 18 వయసు) పిల్లలపై అధ్యయంన చేశాం. ఈ టీనేజీ పిల్లల కదలికను తెలుసుకునేందుకు రోజుకు 10 గంటలు ఓ పరికరాన్ని అమర్చాం.  మీరు ఏం తింటున్నారు.. ఏ స్ట్రోక్ ముప్పు ఉంది!


ఆ పిల్లలు శారీరక శ్రమ కలిగే పనులు చేశారా, లేక తమకు ఇష్టమైన పెయింటింగ్, సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ ఏం పని చేశారా అనేది యాక్సిలోమీటర్లు చూసి తెలుసుకున్నాం. అయితే ఏ పని చేయకుండా ఒకేచోట ఎక్కువ సమయం కూర్చుండిపోయిన పిల్లలు డిప్రెషన్‌కు అధికంగా లోనవుతున్నారు. 18ఏళ్ల వయసున్న వారిలోనే డిప్రెషన్ లక్షణాలు అధికంగా కనిపించాయని’ వివరించారు. హాలీవుడ్ బుట్టబొమ్మ బికినీ Photos


12, 14, 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రోజూ శారీరక శ్రమ చేసిన పిల్లలు 18వ ఏట ఉత్సాహంగా కనిపించారని, ఇది వారి వ్యక్తిగత, కెరీర్‌లోనూ దోహదం చేస్తుందన్నారు. పెద్దవారు సైతం ఒకేచోట కూర్చుని పనిచేసేవాళ్లు ప్రశాంతతను సులువుగా కోల్పోతారని, అందుకే పనిచేస్తున్నా మధ్యమధ్యలో కొంత విరామం తీసుకుని అటు ఇటూ ఓ 10 నిమిషాలు నడిస్తే ఒత్తిడి తగ్గి పనిని కూడా ఎంజాయ్ చేస్తారని రీసెర్చ్ టీమ్ సీనియర్ రచయిత జోసెఫ్ హేస్ ఆ జర్నల్‌లో వివరించారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 


ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos