వేగంగా విస్తరిస్తున్నహైపటైటిస్...
హెపటైటిస్ వైరస్... మనలో చాలా కొద్ది మంది మాత్రమే దీని గురించి తెలుసు ..ఒక వేళ దీనిపై అవగాహన ఉన్నా.. అది పైపై మాత్రమే. దీని తీవ్రత తెలిసినట్లయితే ప్రతి ఒక్కరు దీనిపై శ్రద్ధపెట్టకుండా ఉండలేరు. ఎందుకంటే హెచ్‌ఐవీ తర్వాత అంతటి ప్రాణాంతక వ్యాధి అంటున్నారు వైద్యులు. కాలేయ వ్యాదులు ప్రాణాతకంగా మరుతాయనే విషయం తెలిసిందే. కాలే జబ్బులకు కారణమయ్యే వైరస్లలతో హెపటైటిస్ ముఖ్య మైనది. ఇది గనుక ఒక్కసారి మన బాడీలో ప్రవేశించిందంటే ఎప్పటికీ తొలగిపోదు. ప్రపంచంలో 40 కోట్ల మంది దీని బారిన పడినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.
ఏటా ఈ వైరస్ మూలంగా 14 లక్షల మంది చనిపోతున్నారు. ఎయిమ్స్ లెక్కల ప్రకారం భారత దేశంలో 6 నుంచి 12 లక్షల మంది వరకు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇంతటి తీవ్రమైన సమస్య ఉన్న నేపథ్యంలో హెపటైటిస్ వైరస్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం...
హైపర్‌టైటిస్ అంటే...
కాలేయం మన శరీర అవయవాలన్నింటిలో అతి పెద్ద గ్రంథి. ఇది ఆహారం జీర్ణం చేసుకోవడానికి, శక్తిని నిల్వ ఉంచుటకు, వ్యర్థపదార్థాలు బయటకు పంపుటకు సహాయపడుతుంది.కాలేయవాపును హెపటైటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు, కొన్ని రకాల మందులు, వివిధ రకాల కారణాల చేత వస్తుంది. వీటిలో వైరస్ వల్ల కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ అని అంటారు. వీటిని హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని ఆరు రకాలుగా విభజించారు. ఇందులో హెపటైటిస్ ఎ, బి, సి మానవులపై తీవ్రప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
వ్యాధి లక్షణాలు :
కామెర్లు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, మూత్రం పచ్చరంగులో రావడం, మలం వివర్ణంగా ఉండటం, కడుపునొప్పి, ముఖ్యంగా కుడివైపు రావడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు గమనించవచ్చు.హెపటైటిస్ వైరస్ గురించి ఎయిమ్స్ డెరక్టర్ అగర్వాల్ ఏమంటున్నారంటే.. కాలేయ వైఫల్యానికి ప్రధాన కారణం హెపటైటిస్ వైరస్ అని చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు సకాలంలో వైద్యం తీసుకుంటే 90 శాతం ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని..రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది. వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్శించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు అగర్వాల్.