COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Red Bananas Benefits: శరీరం అభివృద్ధి కోసం జిమ్‌కి వెళ్లేవారు డైట్‌లో ప్రతి రోజు అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు. సాధారణ అరటిపండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు, ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మనం మార్కెట్‌లో తరచుగా పసుపు రంగు, ఆకు పచ్చని రంగుతో కూడిన అరటిని చూస్తాం..కానీ ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో  ఎర్రటి అరటిపండ్లు కూడా లభిస్తున్నాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ఇందులో ఇరత రంగు అరటి పండ్ల కంటే ఎక్కువగా బీటా కెరోటిన్ అనే మూలకం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. 


ఎరుపు రంగు అరటి పండ్ల ప్రయోజనాలు:
ఒక చిన్న ఎర్రటి అరటిపండులో 90 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ప్రతి రోజు ఉదయం తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లతో పాటు విటమిన్ B6, మెగ్నీషియం, విటమిన్ C కూడా అధిక మోతాదులో లభిస్తాయి. వీటిని ప్రతి రోజు ఆల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. 


ఎర్రటి అరటిపండులో పొటాషియం కూడా అధికంగా పరిమాణంలో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. గుండెపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Jailer Movie HD Quality: జైలర్ మూవీ టీమ్‌కు షాక్.. నెట్‌లో HD ప్రింట్ లీక్..!


ఈ అరటి పండ్లు కళ్ళకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే మూలకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. 


ఈ ఎరుపు రంగు అరటి పండ్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయట. ఇందులో విటమిన్‌తో పాటు విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి తరచుగా వానా కాలంలో, చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Jailer Movie HD Quality: జైలర్ మూవీ టీమ్‌కు షాక్.. నెట్‌లో HD ప్రింట్ లీక్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook