Can We Reduce Belly Fat In 10 Days: బరువు తగ్గడం అనేది పెద్ద సవాలుగా మారింది. చాలా మంది ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. అయితే బరువు తగ్గడానికి తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ డైట్‌తో పాటు పసుపు కలిపిన పాలను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా పాలలో పసుపు వేసుకుని తాగాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు పాలుతో ఎలా బరువు తగ్గుతారో తెలుసా?:
పసుపు పాలలో ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువును తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌తో పాటు, జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ పాలలో పసుపుని కలుపుకుని తాగాల్సి ఉంటుంది.


పసుపు గురించి పరిశోధన ఏమి చెబుతున్నాయి?:
పసుపులో పాలీఫెనాల్, కర్కుమిన్ సమ్మేళనం అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది శరీరంలోని జీవక్రియ వాపును పెంచుతుందని పరిశోధనాలు చెబుతున్నాయి. కాబట్టి పసుపు పాలను ప్రతి రోజు తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్యలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా పసుపులో ఉండే యాంటీ ఒబెసిటీ,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గించడానికి సులభంగా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పసుపులోని గుణాలు కడుపులో పిత్తాన్ని శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది. అంతేకాకుండా వేగంగా శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. పసుపు పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


ఈ సమయంలో పసుపు పాలు తాగితే బరువు తగ్గుతారు:
బరువు తగ్గడానికి, రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ పాలు తాగే క్రమంలో తప్పకుండా రాత్రి పూట లైట్‌గా భోజనం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలను మధ్యాహ్నం పూట కూడా తగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కానీ రాత్రి పడుకునే క్రమంలో తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook