Reduce High Cholesterol: కొలెస్ట్రాల్‌ను 10 రోజుల్లో వెన్నలా కరిగించే టిప్స్ ఇవే.. నయా పైసా ఖర్చు లేకుండా చెక్
Reduce High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Reduce High Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ప్రాణాంతక వ్యాధులకు దారి తీసే కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతోంది. అయితే ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు సమస్యల కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో రక్తంలోని కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో చేరడం పేరుకుపోవడం వల్ల మధుమేహం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది ఆహారాలను ప్రతి రోజు డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు:
ఓట్స్:
ఓట్స్‌లో పీచుపదార్థం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఉదయం అల్పాహారంలో ఓట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా మధుమేహం సమస్యలతో బాధపడేవారికి కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర కొలెస్ట్రాల్, బరువు నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఆహారంలో ఓట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
నానబెట్టిన బాదం:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పును తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బాదంపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. దీంతో వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. వీటిని ప్రతి రోజు ఉదయం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా చర్మంపై మొటిమలు మచ్చలు దూరమవుతాయి.
మొక్కజొన్న:
మొక్కజొన్నతో తయారు చేసిన ఆహారాలు కూడా చాలా ప్రభావంతంగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా శరీరానికి పోషకాలను అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మొక్కజొన్నతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook