COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reduce High Cholesterol Without Treatment: శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం..అయితే ప్రతి మానవ శరీరంలో మంచి, చెడు అని రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. బాడీలో మంచి కొలెస్ట్రాల్‌ పెరిగితే శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయి. అదే చెడు కొవ్వు పెరిగితే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ కొత్త కణాలను సృష్టించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. 


చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు:
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల లక్షణాలు ఏర్పడతాయి. దీని కారణంగా తరచుగా కాళ్ళలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక చెమట లేదా దవడలలో నొప్పి, చేతుల్లో నొప్పి, వికారం వంటి  లక్షణాలు తరచుగా ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ముందే ఏర్పడితే తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి పలు రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరి:
ప్రతి రోజు జంక్ ఫుడ్, కొవ్వు పదార్ధాలు, ఆయిల్ ఫుడ్స్, రెడ్ మీట్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ జన్యుపరమైన కారణాల వల్ల కూడా పెరుగుతుంది. కాబట్టి పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు పప్పులు, బీన్స్, కరిగే ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకోవడం జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభించి..శరీరంలోని కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 


నట్స్ తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది:
నట్స్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం శరీరానికి  అమైనో ఆమ్లాలు, ఎల్-అర్జినైన్ అధికంగా లభిస్తాయి. దీని కారణంగా శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ మూలకం సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహాయపడుతుంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook