Ridge Gourd for weight loss: బీరకాయతో బరువు తగ్గుతారు.. మీ శరీరంలో 5 మ్యాజికల్ మిరాకిల్స్..
బీరకాయ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బీరకాయలో విటమిన్ సీ, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బీరకాయ కీరదోసకాయ జాతికి చెందిన కూరగాయ. ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది. ఇది వాపు సమస్యను తగ్గించి బరువు తగ్గడానికి ప్రేరేపిస్తుంది.
Ridge Gourd for weight loss: బీరకాయ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బీరకాయలో విటమిన్ సీ, ఐరన్ ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బీరకాయ కీరదోసకాయ జాతికి చెందిన కూరగాయ. ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది. ఇది వాపు సమస్యను తగ్గించి బరువు తగ్గడానికి ప్రేరేపిస్తుంది.
బరువు తగ్గుతారు..
బీరకాయలో క్యాలరీలు, శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయ తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.
ఇమ్యూనిటీ బూస్ట్..
బీరకాయలో విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బుస్ట్‌కు కూడా తోడ్పడుతుంది. బీరకాయలో కంటి, కాలేయం, కడుపు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తరచూ మనం బీరకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఇదీ చదవండి: ఈ ఒక్క టీ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
బీరకాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ కూరగాయాలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కార్డియోవాస్క్యూలర్ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా నివారిస్తాయి.
పీచు ఎక్కువ..
బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. అంతేకాదు బీరకాయలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య రాదు. ఇది మెరుగైన పేగు ఆరోగ్యానికి సహకరిస్తుంది. అంతేకాదు బీరకాయ మలబద్ధకానికి కారణమయ్యే జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఇదీ చదవండి: పేగు ఆరోగ్యానికి 5 పండ్లు గ్యాస్ అజీర్తి జాడే ఉండదు..
డయాబెటీస్..
డయాబెటిస్ ఉన్నవారు ఈ కాలంలో ఎక్కువ శాతం ఉన్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికప్పుడు నిర్వహణలో ఉంచుకోవాలి. లేకపోతే డయాబెటిస్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అందుకే వీరు ప్రత్యేక డైట్ పాటించాలి. డయాబెటీస్ ఉన్నవారు బీరకాయను తమ డైట్లో చేర్చుకోవచ్చు. ఈ బీరకాయలో గ్లైసెమిక్ సూచి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటంలో సహాయపడతాయి. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇన్సూలిన్ స్థాయిలను నిర్వహిస్తాయి. బీరకాయ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి