Weight Loss In 15 Days: ఈ రొటీ తింటే బెల్లీ ఫ్యాట్ కరిగి కేవలం 15 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
Mokka Jonna Roti For Weight Loss In 15 Days: శీతాకాలంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్తో బాధపడుతున్న వారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.
Mokka Jonna Roti For Weight Loss In 15 Days: ప్రస్తుతం చాలామంది వింటర్ సీజన్లో ఎక్కువగా జొన్న పిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ముఖ్యంగా భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో జొన్న పిండితో తయారుచేసిన రొట్టెలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పిండితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలిగినప్పటికీ..ఆరోగ్య నిపుణులు మాత్రం దీనికి బదులుగా మొక్కజొన్న పిండిని వినియోగించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మొక్కజొన్న పిండితో తయారుచేసిన రోటీలలో సమృద్ధిగా పోషకాలు లభిస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
మొక్కజొన్న పిండిలో ఫైబర్ విటమిన్లు మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పిండితో తయారుచేసిన రోటీలను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మొక్కజొన్న పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మొక్కజొన్న పిండిలో ఉండే కొన్ని గుణాలు బరువు తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
శీతాకాలంలో సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
చాలామంది అధిక శరీర బరువుతో బాధపడుతున్న వారు శీతాకాలంలో అనేక రకాల డైట్లను ఫాలో అవుతున్నారు. అయితే ఇలా డైట్లను అనుసరించేవారు ప్రతిరోజు మొక్కజొన్న పిండితో తయారుచేసిన రోటీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణ క్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చలికాలంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తినాలి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మొక్కజొన్న పిండిలో తక్కువ కేలరీలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. దీంతోపాటు ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఈ పిండితో తయారుచేసిన రోటీలను తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మధుమేహంతో బాధపడే వారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ మొక్కజొన్న పిండితో తయారుచేసిన రోటీలను తినడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి