Sabja Nuts Milk Shake:  సబ్జా గింజలు మిల్క్ షేక్ ఒక రుచికరమైన,  ఆరోగ్యకరమైన జ్యూస్‌. ఇదీ వేసవి కాలంలో తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యాలాభాలు కలుగుతాయి. ఈ సబ్జా గింజలను మీరు పాలు, ఖర్జూరం, యాలకులతో కూడా కలిపి తీసువచ్చు.  వీటితో ఎన్నో రకాల జ్యూస్‌లు, ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సబ్జా గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో,  సబ్జా మిల్క్‌ షేక్‌ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


శరీరానికి చల్లగా ఉంచడంలో:  


వేసవికాలంలో శరీరాని చల్లదనాన్ని అందించడంలో సబ్జా గింజలు ఎంతో ఉపయోగపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 


శక్తిని పెంచుతాయి:  


సబ్జా గింజలు తీసుకోవడం వల్ల వేసవి ఎండల్లో కోలిపోయిన శక్తిని మళ్లీ తిరిగి తీసుకువస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. 


జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి:  
 
మలబద్దకం, ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి సబ్జా  గింజలు ఎంతో మేలు చేస్తాయి.  దీనిని మనం ప్రతిరోజు నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. 


మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి: 


డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.


రక్తపోటును తగ్గిస్తాయి: 


సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. 


 బరువు తగ్గడానికి సహాయపడతాయి: 


అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉదయం ఈ సబ్జా గింజల నీలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి. 


చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి: 
 
ముఖంపైన మొటిమలు, మచ్చలు కలగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సబ్జా గింజలు తీసుకోవడం చాలా మంచిది. 


సబ్జా గింజలు మిల్క్ షేక్ తయారీ:


కావలసినవి:


* 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు
* 1 కప్పు పాలు
* 2 ఖర్జూరాలు
* 1 యాలకుల పొడి


తయారీ విధానం:


1. సబ్జా గింజలను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
2. ఒక గ్లాస్‌లో పాలు, ఖర్జూరాలు, యాలకుల పొడి వేసి బ్లెండ్ చేయండి.
3. నానబెట్టిన సబ్జా గింజలను నీటి నుండి తీసి, బ్లెండ్ చేసిన పాలలో కలపండి.
4. మంచిగా బ్లెండ్ చేసి, వడకట్టి, చల్లగా తాగండి.


చిట్కాలు:


* రుచికి సరిపడా పంచదార లేదా తేనెను కలపవచ్చు.
* మరింత రుచి కోసం, మీరు కొన్ని బెర్రీలు, పండ్ల ముక్కలు కూడా కలపవచ్చు.
* ఈ పానీయాన్ని వెంటనే తాగడం మంచిది.


సబ్జా గింజల జ్యూస్‌ ఇది వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి  మీకు శక్తిని అందించడానికి ఒక గొప్ప మార్గం.


Also Read: Coconut Milk: సాధారణ పాల కంటే ఈ కొబ్బరి పాలు ఎంతో మేలు! లాభాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter