Saffron Benefits: చిటికెడు చాలు ఒకటా రెండా 8 రోగాలకు పరిష్కారం
Saffron Benefits: కేసరి..కుంకుమ..శాఫ్రాన్. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు కలిగిన అత్యంత విలువైన పదార్ధం. ఖరీదు ఎక్కువే కావచ్చు కానీ ఆరోగ్యరీత్యా దివ్యౌషధమే. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Saffron Benefits: కుంకుమ పువ్వు ప్రయోజనాలు వినేకొద్దీ చెప్పాలనిపిస్తాయి. అన్ని ఉంటాయి మరి. వంటలకు ప్రత్యేకమైన అద్భుత రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగింది. దీని ఖరీదు ఎంత ఉంటుందో..ప్రయోజనాలు అన్ని ఉంటాయి. ఇది చేసే మేలు చాలా ఎక్కువ. అందుకే ధర ఎంత ఉన్నా కొనుగోలు చేస్తుంటారు
కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. కిలో కుంకుమ పువ్వు 3-4 లక్షల రూపాయలు ఉండవచ్చు. ఒక గ్రాము కుంకుమ పువ్వు 2-3 వందలకు పైగా ఉంటుంది. క్వాలిటీని బట్టి ధర మారుతుంటుంది. కుంకుమ పువ్వులో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటడం వల్ల శరీరంలోని డెడ్ సెల్స్ నుంచి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు ఆకలి వేయదు. దాంతో ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. బరువు నియంత్రణకు దోహదమవుతుంది. ఇందులో ఉండే యాంటీ డిప్రసెంట్ గుణాల కారణంగా ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించవచ్చు. క్రమ పద్ధతిలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కుంకుమ పువ్వు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. కుంకుమ పువ్వు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోజూ క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుుతంది. ఏకాగ్రత వస్తుంది.
కుంకుమ పవ్వులో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లబిస్తుంది. కుంకుమ పువ్వు కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల కేటరాక్ట్ వంటి కంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మాన్ని మృత కణాల్నించి కాపాడవచ్చు. చర్మాన్ని యౌవనంగా, మృదువుగా మారుస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
Also read: Drumsticks 6 Benefits: మునగాకు లాభాలు అన్నీ ఇన్నీ కావు..తెలిస్తే వదిలిపెట్టరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook