Hot Sauce Benefits And Side Effects:  కొందరు టొమాటో సాస్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. సాస్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ సాస్‌ లేకుండా ఏ వంట పూర్తి కాదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల సాస్‌లు లభిస్తున్నాయి. అందులో వేడి సాస్‌లు, స్వీట్ సాస్‌లు, టాంగీ సాస్‌లు మన ఆహారానికి రుచిగా తయారు చేస్తాయి. వీటితో పాటు హాట్‌ సాస్‌ ఒకటి. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  కానీ అతిగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు బారిన పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు సాస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాస్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:


హాట్‌ సాస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల రక్తపోటు లెవెల్ప్‌ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థరైటిస్‌ను, మైగ్రేన్, కీళ్ల నొప్పుల నుంచి సహాయపడుతుంది. 


అంతేకాకుండా హాట్ సాస్ లో మినరల్స్‌ , విటమిన్ ఎ, సి, బి6, కె , మెగ్నీషియం ఇతర పోషకాలు లభిస్తాయి. 
 
బరువు తగ్గడంలో కూడా హాట్‌ సాస్‌ సహాయపడుతుంది. దీని వల్ల అనవసరమైన కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు తొలగించడంలో మేలు చేస్తుంది.


హాట్ సాస్‌ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా కేలరీలను అదుపులో ఉంచుతుంది.


మనం అలర్జీల నుంచి బయట పడడానికి ఎంతో  సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


శరీరా గాయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అంటున్నారు. 


హాట్ సాస్‌ వల్ల కలిగే నష్టాలు ఇవే: 


హాట్‌ సాస్‌లో లాభాలు ఉన్నప్పటికీ దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.


హాట్‌ సాస్‌ను ఎక్కువగా తినడం వల్ల రక్తం గడ్డకట్టడాని కారణమవుతుంది.  దీని వల్ల గుండెపోటు సమస్యలు తలెత్తుతాయి. 


హాట్‌ సాస్‌ను తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లం ఉప్పగా మారుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter