Fennel Seeds Benefits: రోజూ పరగడుపున సోంపు నీళ్లు తాగితే ఏమౌతుందో ఉహించలేరు మీరు
Fennel Seeds Benefits: నిత్య జీవితంలో ఎదురయ్యే దాదాపు అన్ని సమస్యలకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో లభించే పోషకాలతో అన్ని అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. అలాంటిదే సోంపు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fennel Seeds Benefits: ప్రతి ఇంట్లో కిచెన్‌లో లభించే వస్తువుల్లో ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలుంటాయి. ఈ వస్తువుల్ని సరైన రీతిలో వినియోగిస్తే చాలా వ్యాధులకు మందులు వాడాల్సిన అవసరమే ఉండదు. ఇందులో ఒకటి సోంపు. సోంపులో లభించే పోషకాలతో చాలా సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
సోంపు గురించి అందరికీ తెలిసిందే. చాలామంది దీన్నొక మౌత్ ఫ్రెష్‌నర్‌లానే చూస్తారు. హోటల్స్‌లో భోజనం చేయగానే ప్లేట్‌లో సోంపు తీసుకొచ్చి పెడుతుంటారు. దాంతో కేవలం మౌత్ ఫ్రెష్‌నర్ అని అనుకుంటారు. కానీ సోంపులో ఆరోగ్యానికి ప్రయోజనం కల్గించే పోషకాలు చాలా ఉన్నాయి. రోజూ సోంపు నీళ్లు తాగితే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ముఖ్యంగా రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే చాలా చాలా మంచిది.
సోంపు నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలతో నిత్యం బాధపడేవారికి మంచి ఉపశమనం కల్గిస్తుంది. సోంపు నీళ్లు తాగడం వల్ల గ్యాస్ సమస్య నుంచి దాదాపుగా విముక్తి లభిస్తుంది. కడుపు సంబంధిత చాలా సమస్యలకు సోంపు అద్భుతంగా పనిచేస్తుందంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిపూర్ణంగా లభిస్తాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురు కావచ్చు. సోంపు రోజూ తీసుకోవడం వల్ల లేదా సోంపు నీళ్లు తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ కూడా హాని కల్గించలేవు. రోజూ సోంపు నీళ్లు తాగుతుంటే వయస్సు ప్రభావం పడదు.
సోంపును సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే సోంపు నీళ్లు రోజూ తాగడం వల్ల ముఖంపై నిగారింపు పెరుగుతుంది. శరీరం కూడా మిళమిళలాడుతుంది. శరీరంలోపలున్న వ్యర్ధాలు సులభంగా బయటకు తొలగిపోయి శరీరం లోపల్నించి డీటాక్స్ అవుతుంది. ఈ ప్రభావం ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. చర్మం, ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటుంది.
సోంపులో విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సంరక్షణ కల్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా శరీరంలో వివిధ భాగాల్లో ఏర్పడే స్వెల్లింగ్ సమస్య కూడా పోతుంది. అందుకే రోజూ పరగడుపున సోంపు నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
రోజూ ఉదయం వేళ పరగడుపున సోంపు నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే బాడీ మొత్తం హైడ్రేట్‌గా ఉంటుంది. సోంపులో ఉండే కఫం తొలగించే గుణాల కారణంగా దగ్గు, కంజెషన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. అందుకే రోజూ సోంపు నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా పోతాయి. రాత్రి వేళ ఓ గ్లాసు నీళ్లలో సోంపు నానబెట్టాలి. ఉదయం లేచిన వెంటనే సోంపుతో సహా తాగాలి. ఇలా రోజూ చేస్తే 1-2 నెలల్లోనే ఫలితాలు కన్పిస్తాయి.
Also read: Weight Loss: త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా?అయితే ఇవి పాటించక తప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook