Side effects of almonds: బాదం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందులో ప్రోటీన్స్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఆరోగ్యకరమని చెబుతారు. ఇందులో నాన్‌ వెజ్‌ తినలేనివారికి కావాల్సిన ప్రొటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వైద్యులు వీటిని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా బాదం ఇవ్వాలని వెయిట్‌ లాస్‌ వర్కౌట్‌లో ఉన్నవారు కూడా బాదం తింటారు.  అయితే బాదం తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా అతిగా బాదం తినడం వల్ల మన శరీరం పై కనిపిస్తాయి అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలర్జీ..
బాదంలో అలర్జీ కలిగించే లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఇది అలర్జీ రియాక్షన్ బాదం తినడం వల్ల కలుగుతాయి. కొంతమందిలో ఇది ప్రభావం అతిగా చూపిస్తుంది. దురద, వాపు వంటివి కనిపిస్తాయి. బాదం అతిగా తీసుకోవడం వల్ల ప్రాణంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే ముందుగా వైద్యుల సలహా మేరకు బాదం తీసుకోవాలి.


జీర్ణక్రియ సమస్యలు..
నిజానికి బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అతిగా బాదం తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియకు కూడా ఆటంకంగా మారుతుంది .కడుపులో గ్యాస్, అజీర్తికి దారితీస్తుంది. అంతేకాదు బాదం తినేటప్పుడు కూడా సరిగ్గా నమిలి మింగాల్సి ఉంటుంది.


ఇదీ చదవండి: పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుందో తెలుసా?


ఆక్సలైట్..
బాదం గింజలు ఆక్సలైట్స్ ఉంటాయి. ఇవి నాచురల్ గా ఏర్పడతాయి. బాదం తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది .అందుకే ముఖ్యంగా ఆక్సలేట్ సంబంధించిన ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు బాదం అతిగా తీసుకోవడం మానుకోవాలి.


బరువు పెరుగుతారు..
బాదంలో అధిక శాతంలో పోషకాలు ఉంటాయి ఇందులో హై క్యాలరీలు ఉంటాయి. బాదం తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారు. ఇందులో క్యాలరీలు కూడా ఉంటాయి దీంతో బరువు పెరుగుతారు వైద్యుల సూచన తర్వాతే బాదం తినాలి.


ఇదీ చదవండి: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..


కొన్ని నివేదికల ప్రకారం కొన్ని కేసుల్లో భాగంలో కొన్ని ప్రాణాంతక బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇందులో సాల్మొనేళ్ల బ్యాక్టీరియా ఉంటుందంట ఎందుకంటే ఇది ఎక్కువ కాలం నిలువ ఉంచడానికి వినియోగిస్తారు. అందుకే అతిగా బాదం తినడం ఆరోగ్యకరం కాదు ఇది బ్యాక్టీరియా వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుంది.మొత్తానికి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు అలర్జీ సమస్యలు ఉంటే బాదం తీసుకోవడం మానుకోవడమే మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి