Health Alert: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా.. అయితే వెంటనే మానుకోండి!!
Harmful Effects Of Checking Mobile: ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే మీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులను చెబుతున్నారు.
Harmful Effects Of Checking Mobile: ప్రస్తుత కాలంలో ఫోన్ మన దినచర్యలో ఒక భాగమైపోయింది. ఫోన్ అలారం నుంచి ఫుడ్ డెలివరీ వరకు ఫోన్ తోనే పని ముడిపడి ఉంటుంది. అయితే చాలామంది ఉదయం లేవగానే ఫోన్ ని వినియోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఒక రీసెర్చ్ ప్రకారం ఉదయాన్నే ఫోన్ ఉపయోగించడం వల్ల ఇది మన మానసిక స్థితి పైన ఎంతో ప్రభావం చూపుతుందని అధ్యాయంలో తేలింది. చాలామంది ఉదయం లేవగానే ఫోన్ లో వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా స్టోరీలు, ఈ మెయిల్స్ అంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా మనం స్ట్రెస్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ పైన ఉండే లైట్ కంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ బ్లూ లైట్స్ నిద్ర పైన కూడా ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే లేవగానే చాలామంది సోషల్ మీడియాను వినియోగిస్తూ ఉంటారు. కొత్త సమాచారం చూడడానికి ఇష్టపడుతూంటారు. ఆ దశలో పనులకు బ్రేక్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఉదయం ఫోన్ ఉపయోగించడం వల్ల మూడ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే వార్తలు లేక ఇతర సమాచారం మనం మూడ్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అధ్యాయంలో తేలింది.
ఉదయాన్నే సోషల్ మీడియాలో అధికంగా ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యకు గురవుతున్నారని కూడా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఫోన్ ఉపయోగించడం తగ్గిస్తే చాలా మంచిది.
దీనికి బదులుగా కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే సులభమైన యోగాసనాలు చేయడం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం కొద్ది సేపు నడకకు వెళ్లడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. లేదా మీకు కొన్ని పేజీలు పుస్తకం చదవడం వంటి పనులు చేయడం వల్ల శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వారితో కలిసి కాఫీ తాగడం మనసుకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఫోన్ కు బదులుగా ఈ పనులను చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also Read: Orange Seeds: పొరపాటున కూడా ఈ గింజలు పడేయకండి.. దీని వల్ల లాభాలెన్నో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.