కాలక్షేపం వల్లనో లేదా విలువైన సమాచారం అందిపుచ్చుకోవడం వల్లనో కావచ్చు.. నేటి సమాజం, యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వాడుతున్నారు. ఎంతలా అంటే అనవసర అంశాలను కూడా చూసేంత. అయితే నెట్ ను సరైన విధంగా యూజ్ చేసుకోకపోతే మీ సమయం, డబ్బు రెండూ వృధానే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ఇంటర్నెట్ కు రోజుకు ఎంత సమయం వెచ్చిస్తున్నాము.. అందులో పనికొచ్చే అంశాలను ఏమి చూస్తున్నాము అనేది గుర్తించుకోవాలి. దాని వల్ల మనకు ప్రయోజనం ఏమైనా ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఇలా ప్రశ్నించుకుంటే ఎంత సమయం వృధా చేస్తున్నామో గమనించవచ్చు.


* ఇంటర్నెట్ వాడుతున్నాం. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. తరచూ వాటిమీదే దృష్టి సారించడం వల్ల ఏకాగ్రత పోతుంది. కనుక వీలైనంత సమాచారాన్ని మాత్రమే చూసి ఆఫ్ చేయండి.


* ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఆఫీస్ లో, ఇంట్లో పక్కవారిని గమనించడమే మరిచిపోయాం. ఇంట్లో కూడా కుటుంబసభ్యులతో సరదాగా మాట్లాడటానికి దూరమయ్యాము. కనుక ఇంటర్నెట్ ను కాసేపు పక్కకు పెట్టి, ఇంట్లో వాళ్లతో కలిసి హాయిగా మాట్లాడుదాం. నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి.