Skin Care Tips: ఈ మిశ్రమం ఓ వారం రోజులు రాస్తే చాలు..అందంతో నిగనిగలాడిపోతారు
Skin Care Tips: చలికాలం నడుస్తోంది. చర్మ సంరక్షణ చాలా అవసరం, చర్మ సంరక్షణకై బంగాళదుంప ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. బంగాళదుంపతో చర్మానికి నిగారింపు కూడా కలుగుతుంది.
చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బందిగా పరిణమిస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు బంగాళదుంప అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నారు..
చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. చర్మ సమస్యలకు బంగాళదుంప అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలనే ఉంటుంది. అయితే చర్మం రంగు విషయంలో మాత్రం మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ చర్మం నిగనిగలాడాలని కోరుకుంటారు. ఈ క్రమంలో బంగాళదుంప మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బంగాళదుంపతో చర్మానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
ముఖానికి బంగాళదుంప ఇలా రాయాలి
బంగాళదుంప-తేనె
ముఖం రంగు కళకళలాడేందుకు బంగాళదుంప రసంలో తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత ముఖానికి, మెడకు రాసుకోవాలి. కాస్సేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను రోజూ రాస్తే..చర్మం మృదువుగా నిగనిగలాడుతుంది.
బంగాళదుంప-నిమ్మకాయ
బంగాళదుంప, నిమ్మకాయతో చేసిన ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల ముఖం చర్మానికి నిగారింపు వస్తుంది. ఈ ప్యాక్ చేసేందుకు 2 స్పూన్ల బంగాళదుంప రసంలో 2 స్పూన్ల నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే..అందంగా మారుతారు. ముఖం కాంతివంతమౌతుంది. ఇలా ప్రతిరోజూ రాయడం వల్ల ముఖం చాలా క్లీన్ అవుతుంది.
బంగాళదుంప-టొమాటో
ముందుగా బంగాళదుంపను బాగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ టొమాటో, ఒక స్పూన్ తేనె తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని రాసి మస్సాజ్ చేసుకోవాలి. కాస్సేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook