Skin Glow tips: ప్రకృతిలో విరివిగా లభించే ఎన్నో రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యం, అందానికి కావల్సిన మరెన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఏది అవసరమనేది తెలుసుకుని వాడగలగాలి. ప్రకృతిని ఒడిసి పట్టుకున్నంతవరకూ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ప్రకృతిలో లభించే అలాంటి అద్భుతమైన మూలికల్లో ఒకటి అల్లోవెరా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లోవెరా నిజంగానే ఓ అద్బుతం. ఆటు ఆరోగ్యం ఇటు అందం రెండింటినీ పరిరక్షిస్తుంది. అంటే ఆరోగ్యాన్ని మెరుగుపర్చే లక్షణాలతో పాటు చర్మ సంరక్షణకు ఉపయోగపడే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అల్లోవెరా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మ సంబంధిత సమస్యసలు దూరమౌతాయి. అల్లోవెరాతో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లోవెరా వాడటం వల్ల చర్మం, కేశాలు, ఆరోగ్యం మూడింటికీ ప్రయోజనం చేకూరుతుంది. అల్లోవెరాను కూరల్లో వాడవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు లేదా చర్మంపై క్రీములా అప్లై చేయవచ్చు. ముఖ్యంగా అల్లోవెరా ఫేస్‌ప్యాక్ వాడటం ద్వారా నిత్య యౌవనం పొందవచ్చంటున్నారు. 


అల్లోవెరాలో ఉండే పోషకాలు చాలా ఎక్కువ. అల్లోవెరాను ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఎమైనా ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గాయాలు త్వరగా మానుతాయి. డయాబెటిస్ రోగులకు కూడా చాలా ఉపశమనం ఇస్తుంది. ఇందులోని పోషకాలు బ్లడ్ ప్రెషర్ తగ్గించి గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో దోహదం చేస్తాయి. 


అల్లోవెరాను ఎలాగైనా వినియోగించవచ్చు. చర్మానికి నేరుగా అప్లై చేయవచ్చు. గ్రీన్ టీ మిక్స్ చేసి ఫేస్ మాస్క్ తయారు చేసి రాయడం వల్ల మరింత అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడి చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. అల్లోవెరా-గ్రీన్ టీ ఫేస్‌మాస్క్ తయారీ చాలా సులభం. ముందుగా ఒక స్పూన్ అల్లోవెరాలో సగం స్పూన్ గ్రీన్ టీ మిక్స్ చేయాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఓ అరంగట ఉంచుకోవాలి. లేదా రాత్రంతా రాసుకుని ఉంచవచ్చు. ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


రోజూ మీ చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుండాలంటే ఒక స్పూన్ అల్లోవెరాలో 2-3 డ్రాప్స్ గ్రీన్ టీ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. రాత్రి పడుకునేముందు రాసుకుని పడుకుని ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. 


Also read: Zinc Importance: శరీరంలో జింక్ అవసరమేంటి, లోపముంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook