చర్మం నిగారింపు, కాంతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వీటికోసం హోమ్ రెమిడీస్ చాలానే ఉన్నాయి. అయినా చర్మంలో ఏ విధమైన మార్పులుండవు. దీనికి కారణం కొన్ని చెడు అలవాట్లే. ఈ అలవాట్లు చర్మానికి హాని చేకూరుస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మ సంరక్షణ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చర్మానికి నిగారింపు, కాంతి చేకూర్చవచ్చు. అయినా ఒక్కోసారి చర్మ సంరక్షణ సాధ్యం కాదు. వివిధ రకాల చెడు అలవాట్లే దీనికి కారణం. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యమే కాకుండా..చర్మానికి కూడా నష్టం కలుగుతుంది. ఎలాంటి చెడు అలవాట్లు చర్మానికి హాని చేకూర్చుతాయో తెలుసుకుందాం..


చర్మానికి హాని చేకూర్చే అలవాట్లు


1. వేడి నీళ్లతో స్నానం


రోజూ స్నానానికి వేడి నీళ్లు వినియోగిస్తుంటే అది మీ చర్మంతో పాటు కేశాలకు కూడా నష్టం కలిగిస్తుంది. వేడి నీళ్ల స్నానంతో చర్మం డ్రైగా మారుతుంది. కేశాలు తేమ కోల్పోయి నిర్జీవంగా మారుతాయి.


2. స్మోకింగ్


చాలామందికి రోజూ ఎక్కువ సిగరెట్లు తాగే అలవాటుంటుంది. కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు లేకపోయినా పక్కన ఉన్న స్నేహితులు కాల్చే సిగరెట్ల వల్ల ఆ ప్రభావం పడుతుంది. చర్మ సంరక్షణ, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.


3. ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం


కొంతమంది అదే పనిగా స్విమ్మింగ్ చేస్తుంటారు. అంటే ఎక్కువ సమయం స్విమ్మింగ్‌లో కేటాయిస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే స్విమ్మింగ్ ఎక్కువైతే చర్మంతో పాటు కేశాలకు హాని కలుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. స్విమ్మింగ్ ఫూల్ నీళ్లలో క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం, కేశాలకు నష్టం కల్గిస్తుంది.


ఈ అలవాట్లు మనకు తెలియకుండానే మన చర్మం, కేశాలపై దుష్ప్రభావం కల్గిస్తాయి. ఈ మూడింట్లో స్మోకింగ్ తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. స్మోకింగ్ కారణంగా చర్మం నిర్జీవంగా మారడం లేదా ముఖం నల్లగా మారడం జరుగుతుంది. చర్మం సహజ కాంతిని, నిగారింపును పొందాలంటే తక్షణం సిగరెట్ మానేయాల్సి ఉంటుంది. 


Also read: Avocado Hair Mask: అవకాడో హెయిర్ మాస్క్‌తో జుట్టు రాలడం సమస్యలకు చెక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook