Skin Care Tips: రోజూ క్రమం తప్పకుండా రాస్తే చాలు..ముఖం కళకళలాడాల్సిందే
Skin Care Tips: ఆరోగ్య పరిరక్షణ ఎంత మఖ్యంగా బాహ్య ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా చర్మ సంరక్షణ కీలకమైంది. చర్మంపై ఏర్పడే వివిధ రకాల మచ్చలతో చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సమస్యలకు సులభంగానే చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Skin Care Tips: ఏ సీజన్ అయినా సరే చర్మాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి. చర్మానికి తగిన కేర్ తీసుకోకపోతే వివిధ రకాల మచ్చలు ఏర్పడ అసహ్యంగా మారతుంది. అంద విహీనమై నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో
నేర్చుకుందాం..
మనిషి అంతర్గత ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో బాహ్య ఆరోగ్యానికి సైతం అంతే ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది. చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్స్ కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే ఉత్తమం. ఎందుకంటే సహజసిద్ధమైన పదార్ధాలతో దుష్పరిణామాలు కలుగవు. ముఖ్యంగా బంగాళదుంప, టొమాటో రసం ముఖంపై మచ్చల్ని దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. టొమాటో, బంగాళదుంప రసాన్ని రాయడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలు సమూలంగా దూరమౌతాయి.
దీనికోసం ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దూది సహాయంతో ముఖానికి బంగాళదుంప, టొమాటో రసాన్ని రాసి..ఓ అరగంట ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. బంగాళదుంప, టొమాటో రసం వల్ల బ్యాక్టీరియా, డెడ్ స్కిన్, వ్యర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖానికి బంగాళదుంప, టొమాటో రసంతో పాటు కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. ఈ రెండింటి మిశ్రమంలో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలాజెన్ ప్రోటీన్లను పెంచుతుంది. బ్యాక్టీరియాను దూరం చేస్తుంది.
ముఖానికి టొమాటో రసం రాయడం వల్ల పింపుల్స్ పూర్తిగా దూరమౌతాయి. ముఖానికి నిగారింపు వస్తుంది. దీనికోసం ఓ గిన్నెలో బంగాళదుంప రసం, తేనె కలిపి..నిమ్మకాయతో కలిపి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. కాస్సేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజ్ చేసేందుకు బంగాళదుంప, టొమాటో రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేసేందుకు టొమాటో, బంగాళదుంప రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Weight Loss Tips: రోజూ 3 రకాల సీడ్స్ తీసుకుంటే చాలు, ఎంతటి ఊబకాయమైనా ఇట్టే మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook