Sleeping Problem: నిద్ర సమస్యలతో బాధపడుతున్నారా..అయితే రోజూ ఇవి తినండి..!
Sleeping Problem: ప్రస్తుతం చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. నిద్ర పోకపోవడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
Sleeping Problem: ప్రస్తుతం చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. నిద్ర పోకపోవడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజంతా నిరసం, శక్తి కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే నిద్ర పోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి నిద్ర కోసం వీటిని తినండి:
1. పాలు: మంచి నిద్ర పొందడానికి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తాగాలి. పాలలో ట్రిప్టోఫాన్, సెరోటోనిన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్ర వచ్చేందుకు సహకరిస్తుంది.
2. అరటిపండు: రాత్రిపూట అరటిపండు తినడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరటిపండులో ఉండే మూలకాలు కండరాలు, టెన్షన్ లేకుండా ఉంచుతాయి. అరటిపండులో ఉండే మెగ్నీషియం, పొటాషియం మంచి నిద్రను అందిస్తాయి.
3. బాదం: బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుంది.
4. హెర్బల్ టీ: నిద్ర సమస్యలు ఉంటే..కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. రాత్రి పూట హెర్బల్ టీ తాగితే నిద్ర బాగా పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
5. చెర్రీస్: చెర్రీస్‌లో పెద్ద మొత్తంలో మెలటోనిన్ ఉంటుంది. ఇది శరీరం యొక్క అంతర్గత చక్రాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రపోయే ముందు కొన్ని చెర్రీస్ తినడం వల్ల మంచి నిద్ర వస్తుందని భావిస్తున్నారు.
Also Read: Weight Loss Tips: అల్లం, ఉప్పు మిశ్రమం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!
Also Read: Isabgol For Weight Loss: ఈసబ్ గోల్ ఊకతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.