Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం. శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన పోషకాలు కూడా లివర్‌లో స్టోర్ అవుతుంటాయి. సులభంగా ఒక్కమాటలో చెప్పాలంటే లివర్ 5 వందల పనులు చేస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లివర్ ఇంత ముఖ్యమైన ఆర్గాన్ కాబట్టే హెల్తీగా ఉండాలి. ఇందులో ఏ మాత్రం సమస్య వచ్చినా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. లివర్‌కు ఉన్న అద్భుత గుణం ఏంటంటే రీజనరేటివ్ సిస్టమ్. చిన్న చిన్న డ్యామేజెస్ అయితే లివర్ స్వయంగా రికవర్ చేసుకుంటుంది. ఆహారపు అలవాట్లు  బాగుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డైట్‌లో ఎప్పుడూ హెల్తీ ఫుడ్స్ ఉండేట్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటనేది తెలుసుకుందాం.


పసుపులో కర్‌క్యూమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది లివర్ సంబంధిత రోగాల్ని దూరం చేస్తుంది. అదే విధంగా వెల్లుల్లి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అంటే రోజుకు 1-2 రెమ్మలు తింటే లివర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్లయితే సాల్మన్, ట్యూనా, మ్యాకరెల్ వంటి ఫ్యాటీ ఫష్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. లివర్‌‌కు ఇవి లాభదాయకం. 


ఇక పాలకూర, మెంతికూర, గానుగ ఆకులు లివర్‌ను హెల్తీగా ఉంచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పోషకాలు లివర్‌ను స్ట్రాంగ్ చేస్తాయి. వీటితోపాటు  షల్జమన్, బీన్స్, మటర్, కూరగాయలు కూడా తినవచ్చు. వీటీని రోజూ నియమిత మోతాదులో తీసుకుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఉదయం తీసుకునే అల్పాహారంలో బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ ఉంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు నష్టం చేకూరుస్తాయి. వాల్‌నట్స్, బాదం కూడా లివర్‌ను హెల్తీగా ఉంచుతాయి. 


లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే పప్పులు, ఓట్స్, స్ప్రౌట్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. స్వీట్స్‌కు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక లివర్ సమస్యల్లో ప్రదానమైంది ఫ్యాటీ లివర్. ఇటీవల కాలంలో చాలామందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుంది. రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ సేవించడం అలవాటు చేసుకుంటే మరింత మంచిది.


Also read; Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూ వివాదం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు అసలు జరిగిందేంటి>



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.