Stomach Cancer : మీకు తరచూ ఈ ఇబ్బంది కలుగుతుందా? అయితే తస్మాత్ జాగ్రత్త…!
Stomach Pain: ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి కూడా మనం అనుకున్నంత సడన్ గా మన లైఫ్ లోకి రావు. అవి రావడానికి ముందే మన శరీరం కొన్ని సంకేతాలను మనకు అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో క్యాన్సర్ కేసులు అంతకంత పెరుగుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది స్టమక్ క్యాన్సర్.. మరి దాని లక్షణాలు ఏమిటి? అది ఎలా వస్తుంది అనే విషయాలు మనము తెలుసుకుందాం..
Stomach Cancer Reasons: హడావిడి జీవనశైలి ..అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా మన శరీరం ఎన్నో మార్పులకు గురి అవుతుంది. మంచి ఇంటి భోజనం తినడం మానేసి బయట దొరికే జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినడానికి ప్రస్తుత యువత ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాదు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు కూడా ఎక్కువమంది లోబడుతున్నారు. వీటి కారణంగా మన జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. వాటిలో ముఖ్యమైనది మన ఆరోగ్యం పై పడుతున్న ప్రభావం. మరి ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన.. పురుషులలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య.. స్టమక్ క్యాన్సర్.
మరి ముఖ్యంగా ఈ సమస్య గత కొద్ది కాలంగా బాగా పెరిగిపోయినట్టు నిపుణులు గుర్తించారు. కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్.. మన కడుపులో ఉన్న కణాలు నుంచి మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది దీర్ఘకాలికంగా కడుపులో అభివృద్ధి చెందుతుంది కానీ దీని లక్షణాలు మొదట్లో అంత స్పష్టంగా అర్థం కాదు. చాలామంది దీన్ని మొదట్లో గ్యాస్ సమస్యగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఈ కేసులు ఎక్కువగా పెరగడానికి వెనుక కారణాలు తెలుసుకుందాం..
కడుపు క్యాన్సర్ కారణాలు:
లైఫ్ స్టైల్
మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు ముఖ్యమైన కారణం మన జీవనశైలి. ప్రతిరోజు పొద్దున లేవడం, కాసేపు వ్యాయామం చేయడం ,ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఎంత అవసరమో.. శరీరానికి సరియైన ఆహారాన్ని అందించడం కూడా అంతే అవసరం. మనం తీసుకునే రోజువారి ఆహారంలో తాజా కూరగాయలు ,పండ్లు ,ఆకుకూరలు ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. ధూమపానం ,మద్యపానం, మాంసాహారం వీలైనంతగా తగ్గించాలి.
జంక్ ఫుడ్
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టంగా తినేది జంక్ ఫుడ్. నూడిల్స్, బర్గర్, పిజ్జా ఇలా ఎన్నో బయట నుంచి తెచ్చుకొని తింటాం. అయితే వీటిలో ఎక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్స్, స్టోర్డ్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివెస్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి జంక్ ఫుడ్ వీలైనంతగా తగ్గించాలి.
కడుపు క్యాన్సర్ లక్షణాలు :
కడుపు క్యాన్సర్ ప్రారంభ దశలో ఎప్పుడడూ మనకు కడుపునొప్పి కలుగుతుంది. విపరీతంగా బరువు తగ్గడం, ఆకలి లేకుండా పోవడం, వికారం ,వాంతులు ,మలంలో రక్తం ఇవన్నీ ఈ రోగానికి ముఖ్య లక్షణాలు. ఇటువంటివి ఎదుర్కొంటుంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
కడుపు క్యాన్సర్ నివారణ :
ఇటువంటి రోగాలు దరి చేరకుండా ఉండాలి అంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కంటే మించిన నివారణ లేదు. ప్రకృతి సహజంగా దొరికే తాజా ఆహార పదార్థాలను తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం.. ధూమపానం, మద్యపానం నియంత్రించడం.. ఇలాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook