Alcohol Injuries to Health: ప్రతి పది మందిలో నలుగురికి మద్యం అలవాటు ఉంది. ప్రస్తుతం మద్యం తాగని వారిని తక్కువ చూసే రోజులు వచ్చాయి. మద్యం అలవాటు అంతలా మారింది. దీనికితోడు రోజుకు కొంచెం మద్యం తీసుకోవాలని వైద్యులే చెబుతున్నారని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. వైద్యులు చెప్పేది ఒకటి లేదా రెండు పెగ్గులు. డాక్టర్ల పేరు చెప్పి పీపాలు పీపాలు తాగేస్తున్నారు. కానీ మద్యం ఎంత మోతాదులో తీసుకున్నా కూడా ఆరోగ్యానికి హానికరమేనని చాలా సర్వేలు చెబుతున్నాయి. మద్యం తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మద్యం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మద్యం మానివేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం ప్రభావం వలన మానవుడికి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడిస్తున్నారు. అంతర్గతంగా.. బాహ్యపరంగా సమస్యలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. మద్యం అలవాటు ఉన్నవారు కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయాలని హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. 


  • మద్యం సేవించేవారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఏమైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే మద్యం మానేయాలి. తెల్లవారుజామున నిద్రలేవగానే అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. మగతగా.. దేహంలో అలసట.. నీరసంగా ఉంటే మద్యం మానివేయాలి.

  • రోగ నిరోధక వ్యవస్థపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. దీనివలన చిన్న చిన్న వాటికే అనారోగ్యానికి గురవుతారు. మద్యం తీసుకోకముందు ఏ పరిస్థితులనైన తట్టుకునే దేహం మద్యం వలన తట్టుకోలేకపోతుంది. తరచూ అనారోగ్యం పాలవుతారు. అలాంటప్పుడు మద్యం మానివేస్తే మంచిది.

  • మద్యం సేవించడానికి నిద్రలేమి సమస్య ఒక కారణంగా చెబుతారు. మద్యం వలన నిద్ర వస్తుందని చెప్పడం ఒక భ్రమ. కేవలం మత్తు వలన నిద్రపోతారు తప్ప అసలు అది నిద్ర కాదు. మద్యం సేవిస్తున్నా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటుంటే మద్యం మానేయాల్సిన సమయం వచ్చిందని గ్రహించాలి.

  • కాలేయం ఇతర అవయవాలపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తే మద్యానికి దూరంగా ఉండాలి.

  • కడుపులో ఉబ్బరంగా ఉంటే అది మద్యం ప్రభావంగా గుర్తించాలి. మద్యం జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే మద్యం మానేయాలి.

  • మద్యం వలన చర్మ సమస్యలు కూడా వస్తాయి. దురద, దద్దుర్లు వస్తుంటే అది మద్యం వలన అని గ్రహించాలి. వెంటనే మద్యం మానివేస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • దంతాలు, చిగుళ్ల సమస్య ఏర్పడితే అది మద్యం వలన కూడా కావొచ్చు. మద్యంలోని రసాయనాలు నోటి దంతాల ఎనిమిల్‌పై దాడి చేస్తుంది. మద్యం తీసుకోవడం ఆపివేయాలి.

  • మద్యం అనేది ఏ రకంగాను ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మత్తులో మునిగిన తర్వాత జరిగే అనర్థాలకు మద్యమే కారణమని గుర్తించి వాటికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు

Also Read: Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter