Straberry for Heart Health: ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం గజిబిజి జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లు.. చాలా మంది ఆయిల్ ఫుడ్, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఇవి రుచికి బాగుంటాయి కానీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటి వల్ల రక్త కణాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగటం వలన మెల్ల మెల్లగా రక్తపోటు గురయ్యే అవకాశాలను పెంచుతుంది. ఇది గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాలని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి సహాయం చేసే ఒకే ఒక పండు స్ట్రాబెర్రీ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుండె ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీ తినడం ఎంత రుచికరంగా ఉంటుందో.. గుండెకు కూడా అంతే మేలు చేస్తుందని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ తెలిపారు.ఈ ఎర్రటి పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావున వీటి నిర్లక్ష్యం చేయడం పెద్ద తప్పు. నేటి యుగంలో గుండె పోటు ఒక పెద్ద సమస్యగా మారింది. కావున గుండె ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు స్ట్రాబెర్రీ ని తినడం మంచిది. దీని వల్ల గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 


గుండెకు స్ట్రాబెర్రీ ఎలా మంచిది..?
పాలీఫెనాల్స్ కు స్ట్రాబెర్రీలు గొప్ప మూలం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్ట్రాబెర్రీలలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే వాటి వలన గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 


Also Read: Minister KTR: కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  


ఎన్ని స్ట్రాబెర్రీలను తినాలి..?
చాలా మంది ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన యువకుడు 2 నుండి 3 కప్పులు కట్ చేసిన స్ట్రాబెర్రీలను తినాలి. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడం మొదలవుతుంది. ఫలితంగా గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. 


చెడు కొలెస్ట్రాల్ లో తగ్గుదల.. 
గుండెపోటు రాకుండా ఉండాలంటే.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన  పరిశోధనల ద్వారా నిరూపించబడింది.


Also Read: Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి