Saunf Tips: సోంపు తినడం మంచిదా కాదా..ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి
Saunf Tips: సోంపు విషయంలో మొన్నటివరకూ ఆచరణలో ఉన్నది వేరు. ఇప్పుడు వేరు. ఆరోగ్యపరంగా మంచిదే అయినా ఎప్పుడు..ఎలా..ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంపై కొన్ని పరిమితులున్నాయి. లేకపోతే అనర్ధాలే అంటున్నారు వైద్య నిపుణులు.
Saunf Tips: సోంపు విషయంలో మొన్నటివరకూ ఆచరణలో ఉన్నది వేరు. ఇప్పుడు వేరు. ఆరోగ్యపరంగా మంచిదే అయినా ఎప్పుడు..ఎలా..ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంపై కొన్ని పరిమితులున్నాయి. లేకపోతే అనర్ధాలే అంటున్నారు వైద్య నిపుణులు.
వాస్తవానికి భోజనం తరువాత లేదా ఎప్పుడైనా సరే సోంపు తినడం అనాదిగా వస్తున్న ఓ అలవాటు. ముఖ్యంగా భారతీయలకు సోంపుపై ఆసక్తి ఎక్కువే. ఈ మధ్యకాలంలో సోంపు విషయంలో కొన్ని సందేహాలు, సూచనలు కన్పిస్తున్నాయి. సోంపు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా..కొన్ని పరిస్థితుల్లో హితం కాదంటున్నారు. ఎవరికి మంచిది ఎవరికి కాదు..ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంపై వైద్యుల సూచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్కిన్ ప్రోబ్లమ్స్ ఎదురవుతాయి. సోంపుతో చర్మం చాలా సెన్సిటివ్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మీకు తరచూ తుమ్ముల సమస్య ఉంటే..సోంపు తినడం మానేయండి. లేకపోతే మీ సమస్య మరింతగా పెరగవచ్చు.
బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలు కూడా సోంపు తినడం మంచిది కాదు. మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే తల్లీ పిల్లలిద్దరికీ నష్టం కలుగుతుంది. సోంపు ఎక్కువ మోతాదులో తింటే..ఎలర్జీ రావచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఏదైనా మందులు తీసుకునే అలవాటుంటే..దాంతోపాటు సోంపు తీసుకోవద్దు. సోంపు ఎక్కువగా తింటే కడుపు నొప్పి కలుగుతుంది. అందుకే ఎక్కువ మోతాదులో సోంపు తీసుకోవద్దు. సోంపు మంచిది కదా అని పదే పదే ఎక్కువ తీసుకోకూడదు. మద్యాహ్నం భోజనం తరువాత కేవలం ఒక టీ స్పూన్ సోంపు చాలంటున్నారు వైద్యులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి