Sugar Cane Juice: ఆ సమస్యలుంటే.. చెరుకు రసం పొరపాటున కూడా తాగకూడదు
Sugar Cane Juice: వేసవిలో సాధారణంగా చెరుకు రసం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిమి కల్గించే తాపాన్ని చల్లార్చేందుకు , దాహం తీర్చుకునేందుకు చెరుకు రసం ఎక్కువగా తాగుతుంటారు. చెరుకు రసం ఆరోగ్యానికి అంత మంచిది.
Sugar Cane Juice: అయితే చెరుకు రసం ఆరోగ్యపరంగా ఎంత మంచిదైనా కొందరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. పొరపాటున కూడా తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెరుకు రసం ఎవరెవరు, ఎలాంటి వాళ్లు తాగకూడదో పరిశీలిద్దాం.
వేసవి వచ్చిందంటే చాలు చెరుకు రసం బండ్లకు డిమాండ్ పెరుగుతుంటుంది. చెరుకు రసంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చెరుకురసంలో కాల్షియం, ఇత్తడి, ఐరన్ పుష్కలంగా లబిస్తాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం. చెరుకు రసం క్రమం తప్పకుండా తాగుతుంటే ఐరన్ లోపం ఉండదు. అయితే కొందరు చెరుకు రసం అతిగా సేవించకూడదు. కొందరు అస్సలు తాగకూడదు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు చెరుకురసం తాగడం మంచిది కాదు. ఎందుకంటే చెరుకురసం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతో మధుమేహం వ్యాధిగ్రస్థులకు హాని కల్గిస్తుంది. ఇక జలుబు, తుమ్ములు బాధిస్తుంటే చెరుకు రసానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో చెరుకు రసం తాగితే అనర్ధాలే ఎక్కువ.
కొంతమందికి వివిధ కారణాలతో కడుపు సంబంధిత సమస్యలుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు చెరుకు రసం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే కడుపులో సమస్య ఉన్నప్పుడు సహజంగానే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో చెరుకు రసం తాగడం అలవాటు చేసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. కొంతమందికి పళ్లలో కేవిటీస్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు చెరుకురసం తాగకూడదు. ఎందుకంటే ఇందులో ప్రకృతి సహజ సిద్ధ పంచదార పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో పళ్లకు నష్టం కలుగుతుంది.
Also read: Fruits Benefits: ఏయే పండ్లు తొక్కతో సహా తినాలి, తొక్కతో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook