Sugar Level Never Spike: షుగర్ లెవెల్స్ పెరగకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  అయితే, ప్రతిరోజు దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్సర్‌సైజ్ తరచుగా చేయాల్సి వస్తుంది. సరైన మోతాదులో మందులు తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్మోకింగ్ డిహైడ్రేషన్ వంటి సమస్యలు ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతిరోజు ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల డ్రింక్స్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు పెరగనివ్వవు ప్రమాద స్థాయికి చేరనివ్వవు. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షుగర్ రోగుల సంఖ్య నానాటికి మనదేశంలో పెరిగిపోతుంది. షుగర్ కి రాజధానిగా ఇండియా పెట్టింది పేరు. దాదాప మిలియన్ల మంది షుగర్ తో పోరాడుతున్నారు. ఈ సంఖ్య నానాటికి పెరిగిపోవటానికి ప్రధాన కారణం. లైఫ్ స్టైల్ , వాతావరణ మార్పులు, జెనెటిక్ వల్ల పెరిగిపోతున్నాయి.  అయితే, మనం ఇంట్లో తయారు చేసుకోగలిగే మూడు ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు ప్రమాద స్థితికి చేరుకోవు.


మెంతుల నీరు..
డయాబెటిస్‌ తో బాధపడుతున్నవారు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరలను గ్రహిస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే అమైనో ఆసిడ్స్ ఉంటాయి. అందుకే రోజు ఉదయం పరగడుపున మెంతులు వాటర్ తాగడం మంచిది.


ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..


గిలోయి వాటర్..
ఉదయం పరగడుపున గిలోయ్‌ వాటర్ తాగడం వల్ల కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా అడ్డుకుంటాయి. గిలోయ్ వాటర్ లో ఆల్కలాయిడ్ ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో మంచి ఎఫెక్ట్ రెమెడీగా ఉపయోగిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా గిలోయ్‌ ఆకులతో చేసిన నీరు ఉపయోగపడుతుంది.


దాల్చిన చెక్క టీ..
దాల్చిన చెక్కలో రక్తంలో సగం షుగర్ లెవెల్స్ తగ్గించే ఎఫెక్ట్ గుణాలు ఉంటాయి. వీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగిస్తాయి. దాల్చిన చెక్క గ్లైకోస్ పెరుగుదలకు సహకరిస్తుంది దాల్చిన చెక్క నాచురల్ ఇన్సులిన్ లాగా పని చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు..  పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి