Jeera Drink Benefits in Summer:: వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లని పదార్థాలు తినేందుకు నోరు కోరుకుంటుంది. ఎండకాలంలో చాలా మంది ఐస్‌ క్రీమ్స్‌తో పాటు పలు డ్రింక్స్‌ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన పలు హెల్తీ డ్రింక్స్‌ తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వేసవి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఎండలో పని చేసేవారికి శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. కాబట్టి ఎలాంటి డ్రిక్స్‌ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి కాలంలో మసాలా జీరా డ్రింక్‌ను తాగడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల హైడ్రేటెట్‌ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మసాలా జీరా డ్రింక్ రిసిపినీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మసాలా జీరా డ్రింక్స్‌ కావాల్సి పదార్థాలు:


  • ¼ కప్పు జీలకర్ర

  • 12 నల్ల మిరియాలు

  • 3-4 లవంగాలు

  • ¾ కప్పు చక్కెర

  • రుచి సరిపడ నల్ల ఉప్పు

  • అల్లం

  • రుచికి ఉప్పు

  • చిటికెడు మిరప పొడి

  • ¼ టీస్పూన్ చాట్ మసాలా

  • నిమ్మకాయ వెడ్జ్

  • అవసరం మేరకు బేకింగ్ సోడా

  • అవసరం మేరకు ఐస్ క్యూబ్స్


మసాలా జీరా డ్రింక్ రెసిపీ తయారీ పద్ధతి:
మసాలా జీరా డ్రింక్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్‌పై పాన్ ఉంచాలి. అందులో జీలకర్ర వేయించాలి. ఇది కాకుండా అందులోనే నల్ల మిరియాలు, లవంగాలు వేసి వేయించాలి. వాటిని పక్కన పెట్టి.. ఇప్పుడు నీళ్లు, పంచదార, అల్లం వేసి ఉడికించాలి. ఆ తర్వాత మీరు వేయించిన జీలకర్రలో వైట్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం పంచదార, ఎర్ర కారం వేసి మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి నిమ్మరసంతో సిద్ధం చేసుకున్న జీలకర్ర మసాలా వేయాలి. అందులోనే బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, నిమ్మకాయ రసం వేసుకుని..సోడా వేసుకుని సర్వ్‌ చేసుకుంటే, మసాలా జీరా రెడీ అయినట్లే..


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook