Summer Health Tips: వేసవికాలం మొదలైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంది. శరీరంలో నీరుశాతం తగ్గితే.. వడదెబ్బ బారిన పడడం లేదా మైకంతో పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ వేసవిలో పెరుగును ఎక్కువగా తినడం వల్ల అలాంటి సమస్యల బారిన పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా రోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడమే కాక శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. కాబట్టి వేసవిలో క్రమంలో తప్పుకుండా పెరుగు తింటే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ B-6, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ K, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు లభిస్తాయి. అంతటి విటమిన్స్, పోషకాలు కలిగిన పెరుగును తినడం శరీరానికి మేలు జరుగుతుంది. 


పెరుగు రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..


1. రోగనిరోధక శక్తి మెరుగు..


వేసవిలో పెరుగు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. రోజూ పెరుగు తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.


2. ఎముకలు బలంగా..


అంతేకాకుండా పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహకరిస్తుంది. 


3. బరువు తగ్గడానికి..


బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజూ పెరుగు తింటే చాలు. పెరుగులో ఉన్న పీచు పదార్థం మీరు బరువు తగ్గేందుకు ప్రోత్సహిస్తుంది. దీనిలో ఉంటే మంచి కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రేరేపిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి మార్గం లభిస్తుంది. 


4. జీర్ణవ్యవస్థ మెరుగ్గా..


ప్రతిరోజూ ఆహారంలో పెరుగు చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. తిన్నది తిన్నట్టుగా జీర్ణం అయితే చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.  


Also Read: World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!


Also Read: Chikoo Health Benefits: ఈ అనారోగ్య సమస్యలకు సపోటా పండు ఎంతో మేలు చేస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి