Healthy Summer Drink: వేసవిలో మలబద్ధకం, ఎసిడిటీ దూరం, ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే అద్భుతమైన డ్రింక్
Healthy Summer Drink: పుదీనా ఆరోగ్యానికి మంచిది. పుదీనాలో లభించే పోషక పదార్ధాలతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. తరచూ ఎదురయ్యే కఫం, వాతం వంటి సమస్యల్ని ఇట్టే మాయం చేస్తుంది. వేసవిలో పుదీనా వాటర్ అనేది ఓ అద్భుతమైన డ్రింక్‌గా చెప్పవచ్చు.
Healthy Summer Drink: పుదీనాను పెప్పర్‌మింట్ అని కూడా పిలుస్తారు. చాలామంది పుదీనాను వివిధ రకాల వంటల్లో లేదా చట్నీ కోసం వినియోగిస్తుంటారు. కానీ పుదీనా వాటర్ గురించి చాలా తక్కువమందికే తెలుసు. పుదీనా వాటర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి, ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం..
వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో పుదీనా వినియోగం అనాదిగా ఉన్నదే. పుదీనాతో కడుపు సంబంధిత సమస్యలైన మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల్నించి గట్టెక్కవచ్చు. ఫిజికల్ వీక్నెస్ దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వేసవిలో పుదీనా వాటర్ తాగితే చాలా ఎనర్జెటిక్‌గా ఉండటమే కాకుండా అనేక సమస్యలు దూరమౌతాయి.
పుదీనా వాటర్ తయారీకు 1-2 పుదీనా గుచ్ఛాలు, అర ఇంచ్ అల్లం, అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 పచ్చి మిరపకాయ, 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు, అర టీ స్పూన్ దానిమ్మ గింజల పౌడర్, అర టీ స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా నల్ల మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు కావల్సి ఉంటాయి.
ముందుగా పుదీనాను నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పుదీనా ఆకులు వేరు చేయాలి. మిక్సీలో పుదీనా ఆకులు, అల్లం ముక్క, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడకాచాలి. ఆ తరువాత ఇందులో 2 గ్లాసుల చల్లనీరు పోయాలి. ఇందులో ఆమ్చూర్, నల్ల మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, నల్ల ఉప్పు కలపాలి. కొద్దిగా కారంగా ఉండాలంటే ఇందులో కొద్దిగా కలపవచ్చు. చివర్లో నిమ్మరసం కలపాలి. ఓ అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి..చల్లగా పుదీనా నీరు తాగితే రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవిలో మంచి హెల్తీ డ్రింక్ కాగలదు. తక్షణ ఎనర్జీ ఇస్తుంది.
Also read: Vitamin C Foods: వేసవిలో ఆరోగ్యం కోసం తప్పకుండా తీసుకోవల్సిన పదార్ధాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook