Symptoms Of Dehydration: డీహైడ్రేషన్ లక్షణాలు తెలుసుకోండి... మిమ్మల్ని మీరు కాపాడుకోండి!
Symptoms Of Dehydration: ఇది వేసవి కాలం. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండాలి. లేకపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మన శరీరంలో నీటి కొరత ఉందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Symptoms Of Dehydration: శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంది. మన శరీరంలో తగినంత నీరు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీని ప్రభావం చర్మం, ఉదరంపై కూడా పడుతుంది. అంతేకాకుండా మెదడు సరిగా పనిచేయదు. అందుకే డీహైడ్రేషన్ లక్షణాలేంటో (Symptoms Of Dehydration) ఇప్పుడు చూద్దాం.
చెమట పట్టడం లేదు
ఇది వేసవి కాలం. అటువంటి పరిస్థితిలో మీ శరీరం చెమట పట్టకపోతే మీకు ఇబ్బందులు తప్పవు. మీ శరీరంలో నీటి కొరత ఉందనడానికి ఇది సంకేతం. ఎందుకంటే మీ శరీరం హైడ్రేట్ కాలేదని దీని అర్థం. అలాంటి వారికి చెమట పట్టదు.
వేగవంతమైన హృదయ స్పందన
నీటి కొరత కారణంగా, మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. శరీరంలో తక్కువ నీరు అంటే తక్కువ రక్త పరిమాణం, అంటే మీ గుండె ఎక్కువగా పంప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ గుండె ఎటువంటి కారణం లేకుండా స్పీడ్ గా కొట్టుకుంటున్నట్లయితే, మీరు శ్రద్ధ తీసుకోవాలి.
చర్మంలో మార్పులు
నీటి కొరత కారణంగా, మీ చర్మం ప్రభావితమవుతుంది. ఎండలో ముఖంపై సన్‌స్క్రీన్ రాసుకున్నా.. ఆ తర్వాత కూడా చర్మం పొడిబారుతుంటే.. మీ శరీరం నీటిని కోల్పోతోందని అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితిలో, మీరు ఎక్కువ నీరు త్రాగాలి. మెరుగైన ఆరోగ్యం కోసం, ఒక రోజులో కనీసం 8-9 గ్లాసుల నీరు తప్పనిసరిగా త్రాగాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.