Stomach Cancer Symptoms: కడుపు కేన్సర్ తో సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురి మృతి.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకుందాం..
Stomach Cancer Symptoms: మన శరీరంలో వచ్చే కొన్ని వ్యాధులు ముందస్తుగానే గుర్తించలేం. కానీ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు భవతరిణి మృత్యవాత పడ్డారు. ఆమె కడుపు కేన్సర్ తో బాధపడ్డారు. వాటి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Stomach Cancer Symptoms: మన శరీరంలో వచ్చే కొన్ని వ్యాధులు ముందస్తుగానే గుర్తించలేం. కానీ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు భవతరిణి మృత్యవాత పడ్డారు. ఆమె కడుపు కేన్సర్ తో బాధపడ్డారు. ఈనేపథ్యంలో కడుపు కేన్సర్ లక్షణాలు, చికిత్స విధానం ఎలా ఉంటుందో నిపుణుల సూచనల ద్వారా తెలుసుకుందాం. కడుపు కేన్సర్ ప్రారంభ లక్షణాలు వెంటనే బయటపడవు. సాధారణంగా నవంబర్ కడుపు క్యాన్సర్ అవగాహన నెలగా సూచిస్తుంది. కానీ, సమర్థవంతమైన చికిత్స కోసం కొన్ని సంకేతాలను గుర్తించడం చాలా అవసరం.
కడుపు కేన్సర్ లక్షణాలు నిర్ధిష్ట సంకేతాలతో ప్రారంభమవుతుందట. అంటే, పొట్టలో అసౌకర్యం, ఆకలివేయకుండా కడుపు నిండుగా ఉండటం, గుండెలో మంట వంటివి కడుపు కేన్సర్ ప్రారంభ సూచికలు. వీటిని మనం సాధారణ జీర్ణ సంబంధిత సమస్యలు అని విస్మరిస్తాం. కానీ, ౩ వారాల కంటే ఎక్కువ వేధించే ఏ ఆరోగ్య సమస్య అయినా తీవ్రంగా పరిగణించాలి. సరైన చికిత్స కోసం సకాలంలో స్పందించడం ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు.
Also read: Kitchen Cleaning Tips: కిచెన్ సింక్ జామ్ అయిందా? ప్లంబర్ తో పనిలేదు ఇలా చేయండి..
కడుపు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ లక్షణాల గురించి మీరు ముందుగానే అవగాహన పెంచుకోవడం కూడా చాలా కీలకం. కడుపు క్యాన్సర్ అవేర్‌నెస్ మాసం ఈ నిశ్శబ్దమైన ఈ ప్రాణాంతకమైన వ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం.
Also read: Sugar Spike Foods: ఈ 5 డయాబెటిక్ రోగులకు విషం.. తిన్నవెంటనే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయట.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter