Oral Healthy Foods: పంటి సమస్యలు మనల్ని తరచూ వేధిస్తాయి. దీంతో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే, సమస్య వచ్చిన తర్వాత కంటే ముందస్తు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మనం తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండ్లు, కూరగాయలు..
పండ్లు, కూరగాయలలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి పంటిని చిగుళ్ళని బలంగా ఉంచుతాయి.


పాల ఉత్పత్తులు..
ముఖ్యంగా పాల ఉత్పత్తుల్లో కూడా పంటిని బలంగా మార్చే గుణం ఉంటుంది.


చేప..
ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ళ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి


గింజలు, విత్తనాలు..
ఇవి కూడా పంటి ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం.


నీరు..
రోజంతటిరీ కావలసిన నీటిని తీసుకోవటం వల్ల పళ్ళు కూడా హైడ్రేటెడ్ గా ఉంటాయి. పంటిలో పేరుకున్న ఆహార పదార్థాలు, బ్యాక్టిరియాను తొలగిస్తుంది.


టీ..
టీ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ళను వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.


షుగర్ ఫ్రీ..
షుగర్ ఫ్రీ గమ్ ఫుడ్ పార్టికల్స్ పళ్ళలో పేర్కొన్న వాటిని తొలగిస్తుంది.


ముఖ్యంగా పండ్లు కూరగాయలు డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ పళ్లలో పేరుకున్న ఆ బ్యాక్టిరీయాను ప్లేక్ తొలగిస్తుంది. పండ్లు కూరగాయల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యకరమైన పళ్ళు, చిగుళ్ళకు ఎంతో ముఖ్యం. ఆపిల్స్ లో మన పళ్ళను తెలుపుగా ఉంచుతుంది.


ఇదీ చదవండి: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!


పాల ఉత్పత్తులు తీసుకోవడం ముఖ్యంగా పాలు, పెరుగు ,చీజ్ వంటివి కాల్షియం ఫాస్ఫరస్ కలిగి ఉంటాయి .కాబట్టి అవి ఆరోగ్యకరమైన పళ్లకు ఎంతో ముఖ్యం. ఈ ప్రాబయోటిక్స్ బ్యాక్టీరియాని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 


ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సల్మాన్, ట్యూనా, మాక్రోల్ ఫిష్ తీసుకోవడం వల్ల ఇందులోనే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పంటిపై పేరుకున్న ప్లేక్‌ ని తొలగిస్తుంది. ఇక గింజలు, విత్తనాల్లో ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం .బాదంలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, స్ట్రాంగ్ టీత్ కి ప్రోత్సహిస్తుంది. టీ లో ఉండే ఫ్లోరైడ్ పంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ వల్ల చిగుళ్ల వ్యాధులు రావు. గ్రీన్ టీ ఫ్లోరైడ్, యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది.


ఇదీ చదవండి: ఈ 7 మార్నింగ్ ఆహారాలతో యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలు కూడా  మాయం..


షుగర్ ఫ్రీ గ్రమ్ ని నా తీసుకోవడం వల్ల చిగుళ్లలో పేర్కొన్న బ్యాక్టిరియా తొలగిపోతుంది రక్తప్రసరణ మెరుగవుతుంది. ఆరోగ్యకరమైన పళ్లు చిగుళ్ల ఆరోగ్యానికి ఇలా డైట్ నిర్వహించడం మంచిది. ప్రతిరోజు రెండు పూటలా పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవాలి. ఏవైనా పంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి