Hing Benefits: రోజూ చిటికెడు ఇంగువ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!
Hing Health Benefits: మనం రోజు వంటల్లో ఇంగువను ఉపయోగిస్తాము. ఇంగువలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇంగువను ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
Hing Health Benefits: ఇంగువను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిలో అనేక పోషకగుణాలు దాగి ఉన్నాయి. దీని హింగ్‌ని పిలుస్తారు. ఆసఫోటిడా అని కూడా పిలుస్తారు. అలాగే దీని వేయడం వల్ల చక్కటి వాసనతో రుచి కూడా పెరుగుతుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఇంగువను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.పొట్టలో అసౌకర్యం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. శరీరంలో మంట, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యల బారిన ఇబ్బందులు పడుతున్నవారు ఇంగువను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడుతారు.
ఇంగువను తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంగువ అనాల్జేసిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
ఇంగువ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. తామర, గజ్జి, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో ఇంగువను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ విధంగా ఇంగువ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కాబట్టి దీని తీసుకోవడం చాలా మంచిది. అయితే దీనిని మితంగా తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఇంగువను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు కూడా ఇంగువను మీ ఆహారంలో బాగా చేసుకోవడం చాలా మంచిది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter