COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tamarind Health Benefits: భారతీయులు చింతపండును వివిధ రకాల ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. సాంబార్‌ నుంచి చారు వరకు ప్రతి దాంట్లో చింతపండును ఉపయోగిస్తారు. నిజానికి ఆహారాల్లో చింతపండును వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా పోషక లోపం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. చింత పండును ఆహారాల్లో వివియోగించడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


చింతపండు ప్రధాన ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపరచడానికి..: 

చింతపండులో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీంతో పాటు మలబద్ధకాన్ని ఎంతో సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.


గుండె ఆరోగ్యానికి మంచిది: 
చింతపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. దీని కారణంగా రక్తపోటు కూడా నియంత్రలో ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. 


రోగనిరోధక శక్తిని పెంచడం: 
చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి..జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. దీని కారణంగా అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.   


బరువు తగ్గడానికి సహాయపడటం:
చింతపండులో కేలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనుభూతి చెందేలా చేస్తుంది. దీని కారణంగా సులభంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


చర్మ ఆరోగ్యానికి మంచిది: 
చింతపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది చర్మం ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


జుట్టు ఆరోగ్యానికి మంచిది: 
చింతపండులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.