Tamarind Leaf Tea Benefits: చింతపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చింతపండులో ఉండే గుణాలు శరీరానికి మంచి లాభాలను చేకూర్చుస్తాయి. అంతేకాకుండా దాని ఆకుల నుంచి వచ్చే టీ వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందికి చింతపండు ఆకుల టీని తాగడం వల్ల వచ్చే  ప్రయోజనాలు తెలియవు.! ఇది రోగనిరోధక శక్తిని పెంచడం నుండి బరువు తగ్గించడం వరకు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కాబట్టి ఈ టీని ఎలా తయారు చేస్తారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తెస్తుంది:


చింతపండు ఆకు టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. చింతపండు ఆకు టీ  చెడు కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపుతుంది.


బరువు నియంత్రణలో ఉంటుంది:


మారుతున్న జీవనశైలి కారణంగా చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకునేందుకు వివిధ పద్ధతులను అవలంబించే వారికి చింతపండు టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గుతుంది.


రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది:


చింతపండు ఆకులలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది.


జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది:


చింతపండు ఆకులలో ఉండే పోషకాలు జీర్ణ రసాలను ప్రేరేపించేందుకు కృషి చేస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యల నుంచి రక్షిస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!


Also Read: Bike Stunt Viral Video: ఒకే స్కూటీపై ఆరుగురు వ్యక్తులు, ముంబై రోడ్లపై వింత విన్యాసాలు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి