Water Melon Seeds Benefits: వేసవిలో దాహం తీర్చడానికి పుచ్చకాయ ఒక అద్భుతమైన పండు. చాలామంది పుచ్చకాయ తిని గింజలు పారేస్తారు. కానీ ఆ గింజల్లో ఎన్నో అద్భుత ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసా? పుచ్చకాయ గింజలు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలతో పాటు, తక్కువ కేలరీలు,  అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలను పచ్చిగా తినవచ్చు, వేయించవచ్చు లేదా కాల్చవచ్చు. వాటిని సలాడ్‌లు, సూప్‌లు, స్ట్యూలకు కూడా జోడించవచ్చు. పుచ్చకాయ గింజలను వెన్న లేదా నట్ బటర్‌గా కూడా తయారు చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ గింజల అద్భుత ప్రయోజనాలు:


పుచ్చకాయ గింజలలో ఉండే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో మేలు చేస్తాయి. మెగ్నీషియం గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ గింజలలోని ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మలబద్ధం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో సాయపడతుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోని షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 


పుచ్చకాయ గింజలలోని ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. పుచ్చకాయ గింజలలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్  పుష్కలంగా దొరుకుతాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
పుచ్చకాయ గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మొటిమలు, దద్దుర్ల నుంచి రక్షిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా, ముడతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.


ఆరోగ్యవంతంమైన, పొడవైన జుట్టు పొందాలి అనుకొనే వారు ఈ పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల ఇందులోని  మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్ జుట్టు వృద్ధిని పెంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి.


పుచ్చకాయ గింజలను ఎలా తినాలి:


పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు లేదా వాటిని వేయించి, ఉప్పు, మిరియాలు వేసి తినవచ్చు.
పుచ్చకాయ గింజలను పొడి చేసి స్మూతీలు, పెరుగు లేదా ఓట్స్ లో కలుపుకోవచ్చు.
పుచ్చకాయ గింజలతో బాదం, వేరుశెనగ వంటి ఇతర గింజలను కలిపి డ్రై ఫ్రూట్స్ బార్లుగా తయారు చేసుకోవచ్చు.


పుచ్చకాయ జ్యూస్‌ మాత్రమే కాకుండా దీని గింజలను కూడా తీసుకోవడం వల్ల పైన చెప్పిన లాభాలు కలుగుతాయి. 


గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహ తీసుకోండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి