Belly Fat Burning Tips: బానపొట్ట సమస్య ఈరోజుల్లో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఇది కూర్చొని ఎక్కువ గంటలు పనిచేయడం లేదా సరైన జీవనశైలిని అనుసరించకపోవడం కూడా కారణం కావచ్చు. అయితే, ఈ బెల్లీఫ్యాట్‌ తగ్గించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో మందులు కూడా ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ మొండి బొడ్డుకొవ్వు తగ్గడం కూడా కష్టం. అయితే, కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే బెల్లీఫ్యాట్‌ తగ్గిపోతుంది. దీంతోపాటు సరైన జీవనశైలి విధానాన్ని కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఓ రెండు వంటింటి వస్తువులతో బెల్లీఫ్యాట్‌ సులభంగా కరిగిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చియాసీడ్స్, దాల్చిన చెక్క ఇవి మన వంటగదిలో అందుబాటులో ఉంటాయి. ఇవి బెల్లీఫ్యాట్‌ తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే కొవ్వు ఈజీగా కరిగిపోతుందట. చియా సీడ్స్, దాల్చిన చెక్క నీరు మన జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచివి. అంతేకాదు ఇవి మన శరీరంలో మెటబాలిక్ రేటును కూడా పెంచుతుంది. దీంతో ఫైబర్, న్యూట్రియేంట్లు సులభంగా గ్రహిస్తాయి. అంతేకాదు ఈ రెండు పేగు ఆరోగ్యానికి కూడా మంచివి. దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.


చియా విత్తనాల్లో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కరిగే, కరగని రెండు ఫైబర్స్ ఉంటాయి. ఇది మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తాయి. పేగు కదలికలకు ప్రోత్సహిస్తాయి. చియా విత్తనాల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి సహకరించే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఇందులో ఆల్ఫా లైనొలెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి.


పాలీఫెనల్స్, ఫ్లవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో సెల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చియా విత్తనాల్లో మినరల్స్, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్పరస్, మ్యాంగనీస్ ఇది బోలు ఎముకలకు అవసరం. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహిస్తాయి. ఇది బాడీ మెటబాలిజం రేటుకు బూస్టింగ్‌ ఇస్తుంది. ఈ సమతుల డైట్‌ తోపాటు బరువు నిర్వహిస్తే హెల్తీగా ఉంటారు.


ఇదీ చదవండి: ఈ 5 సూపర్ ఫుడ్స్ కిడ్నీలో పెరుగుతున్న క్రియాటినిన్ ని అంతం చేస్తాయి..


ఫైబర్..
చియా విత్తనాల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపులోని నీటిని గ్రహిస్తుంది. ఇది కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. 


జీర్ణక్రియ..
చియా విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇన్సూలిన్ స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. 


ఇదీ చదవండి: పరగడుపున బొప్పాయి తింటే లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు..


ఆరోగ్యకరమైన కొవ్వులు..
చియా విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  చియా సీడ్స్, దాల్చిన చెక్క నీటిని రెండిటినీ కలిపి తాగితే బరువు సులభంగా తగ్గిపోతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter