7 Healthy Drinks: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి ఆధారంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మన బాడీ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. వీటికి దూరంగా ఉండాలంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి. ఈరోజు మనం మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 7 మార్నింగ్‌ హెల్తీ డ్రింక్స్‌ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్‌ టీ..
గ్రీన్‌ టీ లో పాలిఫినల్స్ ప్రత్యేకంగా కెటచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం కెటచిన్ కొలెస్ట్రాల్ కలిపి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.  అందుకే గ్రీన్‌ టీ డైట్లో చేర్చుకున్నవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయని నివేధికలు తెలిపాయి.


చియా సీడ్స్‌..
చియా సీడ్స్‌ ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటారు. చియా సీడ్స్‌, సోయా మిల్క్ రెండిటినీ కలిపి తీసుకుంటే ఫైబర్ డబుల్ అవుతుంది. ఇందులో ప్రొటీన్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌ ఉంటాయి. చియా సీడ్స్‌ డైట్లో చేర్చుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లు రుజువు ఉంది. ఇక సోయా మిల్క్‌ లో కొవ్వు ఉండదు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను శరీరంలో నుంచి సులభంగా తరుముతుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.


పసుపు..
పసుపును మనం శతాబ్దాలుగా వినియోగిస్తున్నాం. ఇందులో కర్కూమిన్ ఉంటుంది. పసుపు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించినట్లు నివేధికలు ఉన్నాయి. ఇవి ట్రైగ్లిజరైడ్‌ లెవల్స్‌ కూడా తగ్గిస్తాయి. పసుపు, సోయా మిల్క్‌ కలిపి తీసుకుంటే మరీ మంచిది. కర్కూమిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ సమస్యకు చెక్ పెడుతుంది.


ఇదీ చదవండి:  మీ ఊపిరితిత్తులను ఒక్కసారిగా క్లీన్ చేసే 6 డ్రింక్స్.. ఇంట్లోనే చేసుకోండి..


బీట్‌ రూట్‌ , కేరట్‌..
బీట్‌రూట్‌ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇందులో నైట్రేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. క్యారట్‌ లో కెరొటనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. బీటా కెరొటిన్ వంటివి క్యారట్‌లో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ను గ్రహిస్తాయి. ఓ అధ్యయనం ఎలుకలపై నిర్వహించింది. ఈ పరీక్షలో చెడు కొలెస్ట్రాలో లెవల్స్ తగ్గిపోయాయి.


అల్లం..
అల్లం వల్ల కూడా శరరీంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు సులభంగా తగ్గిపోతాయి. అల్లం, నిమ్మకాయ రసం రెండిటినీ కలిపి ఉదయం హెల్తీ డ్రింక్‌ లా తాగవచ్చు.


టమాట రసం..
టమాటలో లైకిపిన్ ఉంటుంది. ఇది టమాట ఎర్రగా ఉండటానికి కూడా ప్రధానం కారణం. దీనిల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. 


ఇదీ చదవండి: కొబ్బరిబోండం తాగడానికి సరైన సమయం ఏది?


స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీ స్మూథీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీ స్మూథీని ఉదయం తీసుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవలస్‌ అదుపులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter