Morning Drink: టీ మాత్రమే కాదు.. ఉదయానే ఇవి కూడా ట్రే చేయండి
మనకు మన ఆరోగ్యం అంటే పంచప్రాణాలు. ఇంచు హైటు పెరిగితే సంతోషిస్తాం. కానీ ఇసుమంత కొవ్వు పెరిగే మాత్రం టెన్షన్ పడతాం.
మనకు, మన ఆరోగ్యం అంటే పంచప్రాణాలు. ఆరోగ్యంపై ( Health ) ఆ మాత్రం ధ్యాస ఉండటం ఈ రోజుల్లో చాలా అవసరం. అయితే పొద్దున్నేమనందరం టీతో రోజు ప్రారంభిస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే చేసి బోర్ కొట్టిన వారికి ఈ రోజు కొన్ని ఆప్షన్స్ తెలియజేస్తాం.వీటివల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వీటి వల్ల మీ శరీర బరువు కూడా తగ్గుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది.
ALSO READ| Roses For Health: గులాబీ పూవుల వల్ల ఎన్ని లాభాలో, ఔషధ గుణాలు తెలుసుకోండి
గ్రీన్ టీ ( Green Tea )
ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్లు గ్రీన్ టీను ( Green Tea ) ఎలా కాదంటారు.. అనే విధంగా గ్రీన్ టీ పాపులారిటీ సంపాదించింది. ఎందుకంటే గ్రీన్ టీ లో Epigallocatechin Collate ( EGCG ) అనే యాంటీ బాడీ ఉంటుంది. ఇది కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
యాపిల్ సైడెర్ వినీగర్
Apple Cider Vinegar లో కొవ్వును కరిగించే ఏసెటిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఇన్సూలిన్ లెవల్స్ తగ్గించి, మెటబాలిజం పెంచుతుంది. ఆకలిని అదుపు చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.
కొబ్బరి నీరు ( Coconut Water )
కొబ్బరి నీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ కేలరీస్ ఉంటాయి. అందం పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే బయోఆక్టివ్ ఎంజైమ్స్ వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. మెటబాలిజం పెంచుతుంది.
ALSO READ| Walking Benefits: ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే
నిమ్మకాయ నీరు ( Lemon Water )
మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో బరువు తగ్గిస్తుంది. కొన్ని చుక్కల నిమ్మరసం నీటిలో వేసి తాగినా మెటబాలిజం పెరుగుతుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR