Jaggery Benefits At Night: రోజూ రాత్రి బెల్లం తింటే ఈ వ్యాధులు దరిదాపుల్లోకి రావు!
Health Benefits Of Consuming Jaggery: రాత్రివేళ భోజనం తర్వాత చాలా మందికి తీపి పదార్థాలు తినడం అలవాటుగా ఉంటుంది. అయితే వాటిని కాకుండా ప్రతిరోజూ బెల్లం కొద్దికొద్దిగా తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా మరెన్నో అనారోగ్య సమస్యలు దరిచేరవు.
Health Benefits Of Consuming Jaggery: ఆయుర్వేదంలో నివేదించిన దాని ప్రకారం బెల్లం ప్రతి ఇంట్లో దొరికే దివ్య ఔషధంగా చెబుతుంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలైన ప్రోటీన్, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. కానీ, మనలో చాలా మంది బెల్లంకు బదులుగా పంచదారను తినేందుకు వినియోగిస్తారు. కానీ, పంచదారతో పోలిస్తే బెల్లంలోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం తింటే మన ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తోంది.
ముఖ్యంగా రాత్రివేళ భోజనం తర్వాత ప్రతిరోజూ క్రమం తప్పకుండా బెల్లం తింటే శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లం తినడం వల్ల శరీరానికి తగిన వేడిని అందించడంలో సహాయపడుతుంది. అయితే బెల్లం తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు
రోజూ బెల్లం తినడం వల్ల అనేక రకాల జీర్ణ సమస్యలు నయం అవుతాయి. రాత్రివేళ భోజనం తర్వాత ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు నివారణ
చలికాలం లేదా ఇతర కాలాల్లో మీరు తరచుగా జలుబు, దగ్గు బారిన పడితే బెల్లం తినడం ఎంతో ఉత్తమమైన ఎంపిక. అందులోనూ రాత్రివేళ బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన మరిన్ని పోషకాలు లభిస్తాయి.
చర్మ సమస్యలు నివారణ
చర్మ సౌందర్యానికి బెల్లం కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొద్దికొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు దూరం అవుతాయట. అలాగే బెల్లం తింటే చర్మం మరింత ప్రకాశిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది. లోపల నుంచి చర్మాన్ని మెరుగుపరచడంలో బెల్లం ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.
గుండె సమస్యలు దూరం
బెల్లంలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది గుండెకి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్ట్ పేషంట్లు తాము తినే ఆహారాల్లో చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.
మలబద్ధకానికి స్వస్తి...
మలబద్ధక సమస్యతో బాధపడే వారికి బెల్లం ఓ ఔషధంలా పనిచేస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు బెల్లం తినడం ప్రారంభించండి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం చేసి మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
(NOTE: అంతర్జాలంలో సేకరించిన సమాచారానికి అనుగుణంగా ఈ వివరాలను మీకు అందించడం జరిగింది. అయితే పైన పేర్కొన్న వాటిని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుల సలహాలను పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో పేర్కొన్న అంశాలను మేము ధ్రువీకరించడం లేదు.)
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి