Kindy Health: కిడ్నీ హెల్త్ పెంచే డ్రింక్స్.. చాలా సింపుల్ గురు!
శరీరంలో ముఖ్యమైన అవయవం కిడ్నీలు. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రింక్ తాగండి.
Kidney Health Drinks: కిడ్నీలు రక్తాన్ని శుద్ధిపరచడంలో, శరీరంలో ఉండే వ్యర్థ పదార్ధాలని బయటకి పంపించే విధిని నిర్వహిస్తాయి. కానీ, కొన్నిసార్లు శరీరంలో ఉండే వ్యర్థ పదార్ధాల వల్ల మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కానీ రోజు ఈ ఒక్క డ్రింక్ తాగడం వలన కిడ్నీలను శుభ్రపరచుకోవచ్చు మరియు కిడ్నీలను వ్యాధుల భారి నుండి కాపాడుకోవచ్చు. కిడ్నీలను శుభ్రపరిచే డ్రింక్ గురించి ఇపుడు తెలుసుకుందాం.
మూత్రపిండాల ప్రాముఖ్యత..
కిడ్నీలు చేసే అసలు పని ఏంటంటే.. శరీరంలోని మలినాలను, వ్యర్థ పదార్ధాలను మూత్రనాళాల ద్వారా శరీరం నుండి బయటకి తొలగించడం. అంతే కాకుండా శరీరంలో ఉండే ఉప్పు మరియు పోటాషియం వంటి ఆమ్లాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో ఉండే ఇతర అవయవాలు పని చేయడానికి కావల్సిన ఒక హార్మోన్ ని కూడా విడుదల చేస్తాయి.
కిడ్నీలకు నిమ్మరసం వల్ల కలిగే లాభాలు..
హార్వర్డ్ నివేదిక ప్రకారం రోజు 2 నిమ్మకాయల రసాన్ని నీటిలో కలిపి తాగటం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. అంతేకాకుండా.. కిడ్నీల నుండి టాక్సిన్స్ ని తొలగిస్తుంది. రోజూ 2 నుండి 2.5 లీటర్ల మూత్ర విసర్జన చేసే వారిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే సమస్యని తగ్గించవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని పెంచే ఈ డ్రింక్ ని ఉదయం & మధ్యాహ్నం తాగవచ్చు.
మూత్రపిండాలని శుబ్రపరిచే ద్రావణం
నిమ్మరసం & పుదీనా..
ఒక గ్లాస్ నీళ్ళల్లో నిమ్మకాయ రసం మరియు కొన్ని పుదీనా ఆకులు వేసి అందులో కొద్దిగా చక్కరని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా తాగటం వలన కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మసాలా నిమ్మ సోడా..
ఒక గ్లాస్ నీళ్ళల్లో నిమ్మరసం, జీలకర్ర-ధనియాల పొడి, చాట్ మసాలా మరియు సోడా అన్నిటిని బాగా కలిపి తాగండి. ఈ డ్రింక్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది.
కొబ్బరీ షికంజి
ఈ డ్రింక్ ని తయారు చేయడానికి ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళల్లో నిమ్మ రసం వేసి బాగా కలిపి.. తాగండి. మంచి ఫలితాలను పొందుతారు.
Also Read: Rushikonda Works: రుషికొండ నిర్మాణాలపై సర్వేకు ఏపీ హైకోర్టు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..